OnePlus Buds 4: డ్యూయల్ స్పీకర్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న వన్ ప్లస్.!

HIGHLIGHTS

వన్ ప్లస్ నార్డ్ 5 సిరీస్ తో పాటు కొత్త బడ్స్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

OnePlus Buds 4 బడ్స్ ను స్మూత్ సౌండ్ మరియు స్మార్ట్రర్ సైలెన్స్ తో లాంచ్ చేస్తోంది

ఇందులో డ్యూయల్ స్పీకర్ సెటప్ ను అందించినట్లు వన్ ప్లస్ వెల్లడించింది

OnePlus Buds 4: డ్యూయల్ స్పీకర్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న వన్ ప్లస్.!

OnePlus Buds 4: వన్ ప్లస్ నార్డ్ 5 సిరీస్ తో పాటు కొత్త బడ్స్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అదే వన్ ప్లస్ బడ్స్ 4 ఇయర్ బడ్స్. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను స్మూత్ సౌండ్ మరియు స్మార్ట్రర్ సైలెన్స్ తో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది. గొప్ప లీనమయ్యే సౌండ్ కోసం ఇందులో డ్యూయల్ స్పీకర్ సెటప్ ను అందించినట్లు వన్ ప్లస్ వెల్లడించింది.

OnePlus Buds 4 : లాంచ్

వన్ ప్లస్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ ని కూడా వన్ ప్లస్ నార్డ్ 5 సిరీస్ స్మార్ట్ ఫోన్ లతో పాటు జూలై 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేస్తుంది. ఈ బడ్స్ కలిగిన కీలక ఫీచర్లు కూడా వన్ ప్లస్ వెల్లడించింది. ఈ ఇయర్ బడ్స్ కోసం అమెజాన్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజి నుంచి ఈ అప్ కమింగ్ బడ్స్ వివరాలతో టీజింగ్ చేస్తోంది.

OnePlus Buds 4: ఫీచర్స్

వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ను అదే ఓవల్ షేప్ డిజైన్ తో అందిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ ను డ్యూయల్ డ్రైవర్ (స్పీకర్) సెటప్ తో అందిస్తుంది. ఇందులో, 11mm ఉఫర్ మరియు 6mm ట్వీటర్ రెండు స్పీకర్లు ఉంటాయి. ఇందులో బెస్ట్ ఉఫర్ కోసం డ్యూయల్ డాక్ సెటప్ కూడా ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ ను ప్రీమియం సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపే మరో రెండు ఫీచర్స్ కూడా ఉన్నాయి.

OnePlus Buds 4

వన్ ప్లస్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ 1 Mbps బిట్ రేట్, 24 బిట్ డెప్త్ మరియు 192 kHz శాంపిల్ రేట్ తో గొప్ప హై రెజల్యూషన్ సౌండ్ అందిస్తుందని వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ బడ్స్ LHDC 5.0 మరియు Hi-Res ఆడియో వైర్లెస్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ స్టూడియో గ్రేడ్ సూపర్ సౌండ్ ఆఫర్ చేస్తుందని వన్ ప్లస్ గొప్పగా చెబుతోంది.

Also Read: Nothing Phone (3): లేటెస్ట్ క్వాల్కమ్ చిప్ సెట్ తో నథింగ్ ఫోన్ 3 లాంచ్ కన్ఫర్మ్ చేసింది.!

ఈ బడ్స్ లో లోతైన బాస్, క్రిస్పీ ట్రబుల్ మరియు డైనమిక్ సౌండ్ అందించే 3D స్పటియల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ బడ్స్ లాంచ్ నాటికి ఈ బడ్స్ కలిగిన బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ కూడా వెల్లడించే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo