విలక్షణమైన డిజైన్ తో విడుదలైన Nothing Headphone 1 ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
నథింగ్ భారత మార్కెట్లో యూనిక్ డిజైన్ తో Nothing Headphone 1 లాంచ్ చేసింది
ముందెన్నడూ మార్కెట్ లో చూడని సరికొత్త డిజైన్ తో ఈ హెడ్ ఫోన్ ని అందించింది
ఈ హెడ్ ఫోన్ కుర్రకారును ఆకట్టుకునేలా ఉంటుంది
ప్రముఖ UK బ్రాండ్ నథింగ్ భారత మార్కెట్లో యూనిక్ డిజైన్ తో Nothing Headphone 1 లాంచ్ చేసింది. ముందెన్నడూ మార్కెట్ లో చూడని సరికొత్త డిజైన్ తో ఈ హెడ్ ఫోన్ ని అందించింది. ఈ హెడ్ ఫోన్ చూడటానికి చాలా పెద్ద కనిపిస్తుంది. అయితే, ఈ హెడ్ ఫోన్ డిజైన్ ఆకట్టుకునేలా అందించింది. ఈ హెడ్ ఫోన్ కుర్రకారును ఆకట్టుకునేలా ఉంటుంది. నథింగ్ హెడ్ ఫోన్ అందించిన ఈ హెడ్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyNothing Headphone 1 : ఫీచర్స్
నథింగ్ హెడ్ ఫోన్ 1 ఎక్కువ కాలం మనగలిగే మరియు ప్యూర్ ఆడియో అందించే డిజైన్ తో ఈ హెడ్ ఫోన్ ను అందించింది. పటిష్టమైన డిజైన్ కోసం అల్యూమినియం మరియు అవసరమైన చోట ప్లాస్టిక్ ని వినియోగించి ఈ హెడ్ ఫోన్ ని అందించింది. ఇది సహజమైన ఫిట్ మరియు మృదువైన కంఫర్మ్ అందించే బ్యాలెన్స్ డిజైన్ కలిగి ఉంటుంది.
ఈ నథింగ్ హెడ్ ఫోన్ లో 40mm స్పీకర్స్ కలిగి ఉంటుంది. ఆడియో రంగంలో 60 సంవత్సరాల అనుభవం కలిగిన బ్రిటిష్ బ్రాండ్ KEF భాగస్వామ్యంతో ఈ హెడ్ ఫోన్ ను తీసుకు వచ్చింది. ఇది గొప్ప సౌండ్ కి హామీ ఇస్తుంది. ఈ నథింగ్ హెడ్ ఫోన్ లో 40mm స్పీకర్స్ కలిగి ఉంటుంది మరియు ఇది చాలా క్లియర్ మరియు రిచ్ BASS తో గొప్ప సౌండ్ అనుభూతిని అందిస్తుంది. ఈ నథింగ్ హెడ్ ఫోన్ LDAC మరియు Hi – Res సౌండ్ సపోర్ట్ తో మరింత లీనమయ్యే సౌండ్ అందిస్తుంది.

ఈ నథింగ్ హెడ్ ఫోన్ బయట నుంచి వచ్చే సౌండ్స్ పూర్తిగా నిలువరించే రియల్ టైమ్ అడాప్టివ్ ANC సపోర్ట్ తో వస్తుంది. ఇది గరిష్టంగా 42dB వరకు యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ డెప్త్ తో వస్తుంది. మంచి కాలింగ్ కోసం ఈ హెడ్ ఫోన్ ప్రతీ సైడ్ మూడు మైక్ లతో మొత్తం ఆరు మైక్ లను కలిగి ఉంటుంది. ఇందులో మంచి కాలింగ్ కూడా పొందవచ్చు. ఇందులో ఆన్ హెడ్ డిటెక్షన్, హెడ్ ట్రాకింగ్ మరియు లో ల్యాగ్ మోడ్ ఉన్నాయి.
ఈ నథింగ్ హెడ్ ఫోన్ IP52 రేటెడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది. ఈ హెడ్ ఫోన్ 1040 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ హెడ్ ఫోన్ ఫుల్ ఛార్జ్ తో ఎంసీ ఆఫ్ మోడ్ లో 80 గంటల ప్లే బ్యాక్, ANC ఆన్ మోడ్ లో 35 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.
Also Read: OnePlus Nord CE5 స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్లో అడుగుపెడుతోంది.!
Nothing Headphone 1 : ప్రైస్
నొథింగ్ హెడ్ ఫోన్ (1) ని ఇండియాలో రూ. 19,999 ధరతో లాంచ్ చేసింది. ఈ హెడ్ ఫోన్ జూలై 4వ తేదీ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.