Noise Buds: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న నోయిస్.!

HIGHLIGHTS

నోయిస్ అప్ కమింగ్ బడ్స్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది

ఐకానిక్ విజర్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది

ఈ అప్ కమింగ్ బడ్స్ ను అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది

నోయిస్ అప్ కమింగ్ బడ్స్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను ఐకానిక్ విజర్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేయనున్నట్లు నోయిస్ పేర్కొంది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ ఫీచర్స్ మరియు లాంచ్ వివరాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకోండి.

Noise Buds

నోయిస్ అప్ కమింగ్ బడ్స్ ‘Noise Buds Trooper’ లాంచ్ గురించి నోయిస్ ప్రకటించింది. ఈ బడ్స్ ను త్వరలో లాంచ్ చేస్తుందని నోయిస్ అనౌన్స్ చేసింది. ఈ బడ్స్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా ఉంటుంది మరియు ఈ బడ్స్ కోసం ఇప్పటికే టీజింగ్ మొదలు పెట్టింది.

Noise Buds : ఫీచర్స్

నోయిస్ ఈ బడ్స్ ను ఐకానిక్ విజర్ డిజైన్ మరియు బ్రీతింగ్ LED లైట్స్ తో లాంచ్ చేసింది. చూడటానికి ఈ బడ్స్ రోబో హెడ్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ బడ్స్ వైట్, ఎల్లో మరియు బ్లాక్ మూడు కలర్ ఆప్షన్ లలో కనిపిస్తోంది. ఈ బడ్స్ 10mm స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు 40 మిల్లీ సెకండ్స్ అల్ట్రా లో లెటెన్సీ తో వస్తుంది.

ఈ అప్ కమింగ్ నోయిస్ బడ్స్ హైపర్ షింక్, IPX5 వాటర్ రెసిస్టెంట్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ తో వస్తుంది. ఈ నోయిస్ బడ్స్ వేగంగా ఛార్జ్ చేసే ఇన్స్టాంట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 40 గంటల ప్లే టైం అందించే పవర్ ఫుల్ బ్యాటరీ కూడా కలిగి ఉంటుందని నోయిస్ పేర్కొంది.

Also Read: Redmi A4 5G Launch: అప్ కమింగ్ బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన షియోమీ.!

ఈ నోయిస్ అప్ కమింగ్ బడ్స్ లాంచ్ డేట్ తో పాటు ఈ బడ్స్ మరిన్ని ఇతర వివరాలు అందించవచ్చు. అయితే, ఈ బడ్స్ ఫీచర్స్ ను బట్టి ఈ బడ్స్ ను అండర్ రూ. 1,000 బడ్జెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :