HMD vibe 2 Pro 5G launching with all new design and sony camera
HMD vibe 2 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఆల్ న్యూ డిజైన్ మరియు 64 ఎంపీ సోనీ ప్రీమియం కెమెరా
తో సహా మరిన్ని ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు హెచ్ఎండి తెలిపింది. ఈ ఫోన్ చాలా అందమైన స్లీక్ అండ్ న్యూ కలర్ తో చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో వస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ కీలక ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
హెచ్ఎండి వైబ్ 2 ప్రో 5g అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు హెచ్ఎండి డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ రిలీజ్ పేజీ ద్వారా ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక వివరాలు కూడా రివీల్ చేసింది.
హెచ్ఎండి తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను రిఫైన్ డ్యూయల్ ఫినిష్ అండ్ స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ చూడటానికి చాలా ప్రీమియం లుక్ తో ఉంటుంది మరియు మూడు సరికొత్త రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ సిల్వర్ మిస్ట్, ఆక్వా గ్రీన్ మరియు కాస్మిక్ పర్పుల్ అనే మూడు కొత్త రంగులో లాంచ్ చేస్తున్నట్లు హెచ్ఎండి వెల్లడించింది.
కేవలం డిజైన్ మాత్రమే కాదు ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ ని కూడా కంపెనీ రిలీజ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 6.78 ఇంచ్ డిస్ప్లే తో లాంచ్ చేస్తున్నట్లు హెచ్ఎండి తెలిపింది. ఈ ఫోన్ స్క్రీన్ FHD ప్లస్ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 22 కంటే అధిక ఇండియన్ లాంగ్వేజ్ లకు సపోర్ట్ తో Sarvan అందించిన ఇండస్ ఏఐ తో అందిస్తోంది.
కెమెరా పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64 Sony IMX 682 మెయిన్ కెమెరా జతగా 2MP మైక్రో సెకండరీ కెమెరా ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 13 సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ మంచి ఫోటోలు మరియు వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ కలిగి ఉంటుందని హెచ్ఎండి చెబుతోంది.
Also Read: Vivo V80 5g: కెమెరా లవర్స్ ని ఆకట్టుకునే అద్భుతమైన కెమెరా సెటప్ తో లాంచ్ అవుతోంది.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6000 mAh భారీ బ్యాటరీని తనలో ఇముడ్చుకుంది. ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 33W చార్జ్ సపోర్ట్ అందించింది మరియు ఫోన్ బాక్స్ తో పాటు చార్జర్ ని కూడా అందిస్తున్నట్లు HMD పేర్కొంది. మరింత రక్షణ కోసం ఈ స్మార్ట్ ఫోన్ ని భారత ప్రభుత్వం అందించిన సేఫ్టీ సంచార్ సాతి శక్తితో అందిస్తుంది.