Vivo V80 5g: కెమెరా లవర్స్ ని ఆకట్టుకునే అద్భుతమైన కెమెరా సెటప్ తో లాంచ్ అవుతోంది.!
దసరా పండుగ సేల్స్ కంటే ముందే Vivo V80 5g లాంచ్ చేయడానికి డేట్ సెట్
ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్స్ ని కూడా ఒక్కొక్కటిగా విడుదల చేయడం మొదలుపెట్టింది
ఈ ఫోన్ ను కెమెరా లవర్స్ ని ఆకట్టుకునే అద్భుతమైన కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తోంది
Vivo V80 5g: వివో ఇండియన్ మార్కెట్లో కొత్తగా వివో v8 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని దసరా పండుగ సేల్స్ కంటే ముందే లాంచ్ చేయడానికి డేట్ కూడా సెట్ చేసింది. ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ లో భాగంగా ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్స్ ని కూడా ఒక్కొక్కటిగా విడుదల చేయడం మొదలుపెట్టింది. ఈ ఫోన్ ను కెమెరా లవర్స్ ని ఆకట్టుకునే అద్భుతమైన కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తునట్లు ఈ ఫోన్ కోసం అందించిన కొత్త టీజర్ చెబుతోంది.
SurveyVivo V80 5g: లాంచ్ డేట్
వివో ఈ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ ని అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ మరియు మైక్రో బ్యానర్ అందించి మరీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మరియు ఫీచర్స్ ని ఈ పేజీల నుంచి రివీల్ చేస్తోంది.
Vivo V80 5g: కెమెరా ఫీచర్స్ ఏమిటి?
వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని జబర్దస్త్ కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ లో వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాని అందించింది. ఈ కెమెరా సెటప్ లో 50MP మెయిన్ కెమెరా, 50MP నైట్ టెలిఫోటో కెమెరా మరియు ZEISS అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ కలిగిన ఈ కెమెరాతో 4K సినిమాటిక్ వీడియో అందిస్తుందని వివో తెలిపింది. ఇది 60 FPS 4K తో చాలా స్మూత్ అండ్ క్లియర్ వీడియోలు ఆఫర్ చేస్తుందట. ఈ ఫోన్ కెమెరా సెటప్ పూర్తిగా ZEISS ఆప్టిక్స్ కలిగి ఉంటుంది.

కేవలం వీడియోలు మాత్రమే కాదు జబర్దస్త్ AI కెమెరా ఫీచర్స్ మరియు లేటెస్ట్ వివో ఫిల్టర్లు కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లో ఏఐ క్రియేటివ్ కెమెరా, లైవ్ స్టికర్ కొలాజ్, ఏఐ దివాళీ పోర్ట్రైట్ 2.0 మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ సపోర్ట్ వివరాలు కూడా వివో రివీల్ చేసింది. ఈ ఫోన్ ను 7200 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేస్తోంది.
ఈ ఫోన్ కలర్ వేరియంట్ గురించి కూడా వివో ముందే వెల్లడించింది. ఈ ఫోన్ ను సన్ రైజ్ యాంతం, హారిజన్ బ్లూ, స్టెల్లార్ బ్లాక్ మూడు లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
