Amazon GIF Sale Early Deal ద్వారా లేటెస్ట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ని అతి చవక ధరలో ఆఫర్ చేసింది.!

HIGHLIGHTS

Amazon GIF Sale Early Deal బెస్ట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్

Amazon GIF Sale ముందస్తు డీల్స్ ని ఈరోజు నుంచి అమెజాన్ ప్రారంభించింది

ఈ సౌండ్ కలిగిన టోటల్ సెటప్ తో 800W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది

Amazon GIF Sale Early Deal ద్వారా లేటెస్ట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ని అతి చవక ధరలో ఆఫర్ చేసింది. 2026 దసరా పండుగ సందర్భంగా అమెజాన్ ఇండియా ప్రకటించిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 నుంచి ఈ బిగ్ డీల్ ఈరోజు అనౌన్స్ చేసింది. వాస్తవానికి ఈ సేల్ వచ్చేనెల నుంచి ప్రారంభం కానుండగా ముందస్తు సేల్స్ ని ఈరోజు నుంచి అమెజాన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ సౌండ్ డీల్ అందించింది.

5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్

ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో సౌండ్ బార్ లను అందిస్తున్న బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న GOVO, ఈ మధ్యకాలంలో మార్కెట్లో విడుదల చేసిన ట్రూ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Go Surround 1000 Pro ని ఈరోజు బెస్ట్ ఎర్లీ బర్డ్ డీల్ గా అమెజాన్ అనౌన్స్ చేసింది. ఈ సౌండ్ బార్ మార్కెట్ లో రూ. 24,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది, అమెజాన్ ఈ సౌండ్ బార్ ని ఈరోజు రూ. 9,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.

బ్యాంక్ ఆఫర్, ఈ సౌండ్ బార్ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్ ని కూడా అమెజాన్ ఈరోజు లిస్ట్ చేసింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ని SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని ఈ రోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ద్వారా కేవలం రూ. 14,499 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here

Also Read: కష్టకాలంలో ఆదుకునే EPF Advance కోసం ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకోండి.!

GOVO 5.2.4 Dolby Atmos సౌండ్ బార్

ఈ గోవో సౌండ్ బార్ రీసెంట్ గా లాంచ్ అయ్యింది మరియు ఇది 5.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇది డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్, డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ మరియు ప్రీమియం బార్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ అప్ ఫైరింగ్ ఫైరింగ్ అండ్ రియర్ స్పీకర్లతో థియేటర్ ఫీల్ సరౌండ్ మరియు డ్యూయల్ సబ్ ఉఫార్ తో డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప 3D అండ్ రియల్ ఫీల్ సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ సౌండ్ కలిగిన టోటల్ సెటప్ తో 800W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, బ్లూటూత్, ఆప్టికల్ మరియు AUX వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :