కష్టకాలంలో ఆదుకునే EPF Advance కోసం ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకోండి.!
ఉద్యోగ వేతనం నుంచి కొంత మొత్తాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది
అవసరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకోవచ్చు
ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా వివరాలు అందించాము
ప్రైవేటు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా వారి ఉద్యోగ వేతనం నుంచి కొంత మొత్తాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్, ఈ అమౌంట్ ని కంపెనీ వారి జీతాల నుంచి జమ చేసే విధంగా వారి శాలరీ విభజించి ప్రతి నెల ఆ అమౌంట్ ని వారి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. అలాగే, ఎంప్లొయ్ అందించే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతా లో జమ చేస్తుంది. చాలా మంది ఈ అమౌంట్ ను కదిలించడానికి వీలు లేదు అనుకుంటారు. అయితే, అవసరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులు వారి ఈపీఎఫ్ (Employees’ Provident Fund) ఖాతా నుంచి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిని సాధారణంగా EPF Advance లేదా Form 31 Claim అని అంటారు. ఎంప్లాయిస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇది కష్టకాలంలో ఆదుకునే మంచి మార్గంగా ఉంటుంది. ఈ ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకోండి.
SurveyEPF Advance అంటే ఏమిటి?
ఈపీఎఫ్ అడ్వాన్స్ అనేది ఉద్యోగి తన ఉద్యోగాన్ని వదిలేసినప్పుడు మాత్రమే మొత్తం పీఎఫ్ ను ఉపసంహరించుకోవడం కాదు. ఉద్యోగి నిర్దిష్ట అవసరాల కోసం ఈపీఎఫ్ లో ఉన్న మొత్తంలో నుంచి వారి అవసరాన్ని బట్టి మరియు వారి రిక్వెస్ట్ అర్హతకు అనుగుణంగా కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకోవడాన్ని ఈపీఎఫ్ అడ్వాన్స్ అంటారు.

ఏ అవసరాలకు ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు?
- వైద్య చికిత్స లేదా అనారోగ్యం
- వివాహం
- పిల్లల విద్య
- ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు
- ఇంటి నిర్మాణం
- కొన్ని ప్రత్యేక అత్యవసర పరిస్థితులు
ఈపీఎఫ్ నిబంధనల్లో పేర్కొన్న కొన్ని ఇతర పరిస్థితులు కూడా మీ ఈపీఎఫ్ అడ్వాన్స్ లిస్ట్ లో ఉంటాయి.
EPF Advance అప్లై చేయడానికి ఏమి ఉండాలి?
ఆన్లైన్ లో పీఎఫ్ అడ్వాన్స్ కోసం అప్లై చేయడానికి సాధారణంగా కొన్ని వివరాలు సరిగ్గా ఉండాలి. ఆ వివరాలు లిస్ట్ ఇక్కడ అందించాము.
- మీకు UAN (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) ఉండాలి.
- UAN ద్వారా Member Portal లో లాగిన్ చేయగలగాలి.
- ఈపీఎఫ్ రికార్డుల్లో మీరు జాయిన్ అయినా డేట్ అందుబాటులో ఉండాలి.
- మీ ఆధార్ వివరాలు ఈపీఎఫ్ తో సరైన విధంగా లింక్ / సీడ్ అయి ఉండాలి.
- ఆధార్ కు సంబంధించిన మొబైల్ నెంబర్ OTP స్వీకరించగల స్థితిలో ఉండాలి.
- ఈపీఎఫ్ లో నమోదైన బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉండాలి.
ఈపీఎఫ్ FAQ ప్రకారం, ఆన్లైన్ క్లెయిమ్ సమయంలో ఆధార్ తో లీకైన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. కాబట్టి, పెయిన్ తెలిపిన అన్ని వివరాలు మీరు పూర్తి చేసి మరియు వివరాలు కలిగి ఉండాలి.
Also Read: UPI Payment తో తెలుగు రాష్ట్రాల్లో మారిన పేమెంట్ విధానం.!
ఈపీఎఫ్ కోసం ఎలా అప్లై చేయాలి?
- ముందుగా అధికారిక ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్ ఐపీఎం చేయండి.
- మీ UAN నెంబర్, పాస్వర్డ్ మరియు క్యాప్చా తో లాగిన్ చేయండి.
- లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీస్ ఎంచుకోండి.
- ఇక్కడ సాధారణంగా వివిధ పీఎఫ్ / పెన్షన్ క్లెయిమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
- ఇక్కడ Claim (Form-31, 19, 10C & 10D) అనే ఆప్షన్ ని ఎంచుకోండి.
- ఇక్కడ మీ ఈపీఎఫ్ తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ చివరి 4 అంకెలు నమోదు చేసి Verify చేయాలి
- బ్యాంక్ వివరాలు వెరిఫై అయిన తర్వాత ‘Proceed for Online Claim’ పైన నొక్కండి.
- ఇక్కడ పీఎఫ్ క్లెయిమ్ లో పీఎఫ్ అడ్వాన్స్ / Form 31 ఎంచుకోండి.
- తర్వాత మీరు పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటున్న అవసరం ఎంచుకోండి.
- అలాగే, తీసుకోవాలనుకుంటున్న ఈపీఎఫ్ అడ్వాన్స్ మొత్తాన్ని నమోదు చేయండి.
- ఇందులో అడిగిన వద్ద మరియు అవసరమైన వివరాలు అందించండి.
- ఆధార్ OTP వెరిఫికేషన్ తో ఈ మొత్తం ప్రాసెస్ ని పూర్తి చేయండి.
- చివరిగా, Claim Submit చేయడంతో ఈ పూర్తి తతంగం ముగుస్తుంది.
మీ క్లెయిమ్ ను పరిశీలించిన ఈపీఎఫ్ఓ మీ అర్హతను బట్టి మీకు అందించే అమౌంట్ ను మీ ఈపీఎఫ్ అకౌంట్ తో లింక్ అయిన ఖాతాలో జమ చేస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు అప్లై చేసిన మొత్తం మీకు శాంక్షన్ కాకపోవచ్చు. మీ సర్వీస్ మరియు మీరు అప్లై చేసిన అవసరం మరియు మీ అర్హత ఆధారంగా క్లెయిమ్ సెటిల్ చేయబడుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
