Vivo V80 5g launching with amazon camera setup features
Vivo V80 5g: వివో ఇండియన్ మార్కెట్లో కొత్తగా వివో v8 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని దసరా పండుగ సేల్స్ కంటే ముందే లాంచ్ చేయడానికి డేట్ కూడా సెట్ చేసింది. ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ లో భాగంగా ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్స్ ని కూడా ఒక్కొక్కటిగా విడుదల చేయడం మొదలుపెట్టింది. ఈ ఫోన్ ను కెమెరా లవర్స్ ని ఆకట్టుకునే అద్భుతమైన కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తునట్లు ఈ ఫోన్ కోసం అందించిన కొత్త టీజర్ చెబుతోంది.
వివో ఈ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ ని అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ మరియు మైక్రో బ్యానర్ అందించి మరీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మరియు ఫీచర్స్ ని ఈ పేజీల నుంచి రివీల్ చేస్తోంది.
వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని జబర్దస్త్ కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ లో వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాని అందించింది. ఈ కెమెరా సెటప్ లో 50MP మెయిన్ కెమెరా, 50MP నైట్ టెలిఫోటో కెమెరా మరియు ZEISS అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ కలిగిన ఈ కెమెరాతో 4K సినిమాటిక్ వీడియో అందిస్తుందని వివో తెలిపింది. ఇది 60 FPS 4K తో చాలా స్మూత్ అండ్ క్లియర్ వీడియోలు ఆఫర్ చేస్తుందట. ఈ ఫోన్ కెమెరా సెటప్ పూర్తిగా ZEISS ఆప్టిక్స్ కలిగి ఉంటుంది.
కేవలం వీడియోలు మాత్రమే కాదు జబర్దస్త్ AI కెమెరా ఫీచర్స్ మరియు లేటెస్ట్ వివో ఫిల్టర్లు కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లో ఏఐ క్రియేటివ్ కెమెరా, లైవ్ స్టికర్ కొలాజ్, ఏఐ దివాళీ పోర్ట్రైట్ 2.0 మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ సపోర్ట్ వివరాలు కూడా వివో రివీల్ చేసింది. ఈ ఫోన్ ను 7200 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేస్తోంది.
ఈ ఫోన్ కలర్ వేరియంట్ గురించి కూడా వివో ముందే వెల్లడించింది. ఈ ఫోన్ ను సన్ రైజ్ యాంతం, హారిజన్ బ్లూ, స్టెల్లార్ బ్లాక్ మూడు లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.