Redmi A4 5G Launch: అప్ కమింగ్ బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన షియోమీ.!

HIGHLIGHTS

Xiaomi ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ను సేల్ పార్టనర్ గా ఎంచుకుంది

ఈ ఫోన్ ప్రీమియం హేలో గ్లాస్ మరియు శాండ్విచ్ డిజైన్ తో వస్తుంది

Redmi A4 5G Launch: అప్ కమింగ్ బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన షియోమీ.!

Redmi A4 5G Launch: ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Xiaomi ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసింది. షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అదే రెడ్ మీ A4 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో కంపెనీ కూడా మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్లు మరియు లాంచ్ వివరాలు తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi A4 5G Launch

Redmi A4 5G Launch

రెడ్ మీ ఎ4 5జి స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 20వ తేదీ విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసినట్లు షియోమీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ను సేల్ పార్టనర్ గా ఎంచుకుంది. అందుకే అమెజాన్ ఇండియా ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించి మరి టీజింగ్ చేస్తోంది. ఈ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను అందించింది.

Redmi A4 5G : ఫీచర్స్

రెడ్ మీ ఎ4 5జి స్మార్ట్ ఫోన్ ను 6.88 ఇంచ్ స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుందని రెడ్ మీ తెలిపింది. ఈ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ లో Snapdragon 4s Gen 2 చిప్ సెట్ ఉంటుందని కన్ఫర్మ్ అయ్యింది. అంతేకాదు, ఈ చిప్ సెట్ ఈ ఫోన్ తో గ్లోబల్ డెబ్యూట్ గా వస్తుంది. డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్ చూడ్డానికి చాలా స్లీక్ గా ఎలిగెంట్ గా కనిపిస్తోంది.

రెడ్ మీ ఎ4 5జి స్మార్ట్ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు వాటర్ డ్రాప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం హేలో గ్లాస్ మరియు శాండ్విచ్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 5160 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుందని కూడా షియోమీ వెల్లడించింది.

Also Read: Toxic Panda Malware: ఆండ్రాయిడ్ యూజర్లు ఈ కొత్త మాల్వేర్ తో జాగ్రత్త సుమ.!

ప్రస్తుతానికి అందించిన టీజర్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుందని అర్ధం అవుతోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ ఫోన్ మరిన్ని కీలకమైన ఫీచర్స్ ను వెల్లడించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile