CES 2026 నుంచి Noise Master Buds 2 ను ఆవిష్కరించిన నోయిస్.!
లాస్ వేగాస్ లో జరుగుతున్న అతిపెద్ద టెక్ షో CES 2026
నోయిస్ తన సరికొత్త Noise Master Buds 2 ను ఆవిష్కరించింది
బిగ్ షో నుండి నోయిస్ తన ప్రత్యేకమైన ఇయర్ బడ్స్ ను ఆవిష్కరించింది
లాస్ వేగాస్ లో జరుగుతున్న అతిపెద్ద టెక్ షో CES 2026 నుంచి ఈరోజు నోయిస్ తన సరికొత్త Noise Master Buds 2 ను ఆవిష్కరించింది. ముందు వచ్చిన నోయిస్ మాస్టర్ బడ్స్ నెక్స్ట్ జనరేషన్ బడ్స్ గా ఈ కొత్త బడ్స్ అందిస్తున్నట్లు నోయిస్ తెలిపింది. అంతేకాదు, ముందు తరం బడ్స్ కలిగిన Sound by BOSE అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు కూడా తెలిపింది.
SurveyCES 2026 : Noise Master Buds 2
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అట్టహాసంగా మొదలయ్యింది. ఈ షో నుంచి అనేక కంపెనీలు తమ ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ ను ఆవిష్కరించడానికి మక్కువ చూపుతారు. ఈరోజు ఈ బిగ్ షో నుండి నోయిస్ తన ప్రత్యేకమైన ఇయర్ బడ్స్ ను ఆవిష్కరించింది. అదే, నోయిస్ మాస్టర్ బడ్స్ 2 ట్రూ ఇయర్ బడ్స్.
ఈ కొత్త బడ్స్ ను కూడా గత జనరేషన్ బడ్స్ మాదిరి షార్ప్ వినైల్ డిస్క్ ఇన్‌స్పైర్డ్ కెరీ ఆపరేటింగ్ కేస్ డిజైన్‌తో అందిస్తునట్లు చెబుతున్నారు. అంతేకాదు, ఈ కొత్త బస్సు ను కూడా Sound by Bose సాంకేతికతతో ట్యూన్ చేసిన ఆడియో సాంకేతికతతో అందిస్తున్నట్లు కూడా తెలిపారు. దీనిఅర్ధం, ఈ అప్ కమింగ్ బడ్స్ కూడా క్లియర్ హైస్ మరియు డీప్ బాస్ తో పాటు సరైన సమతుల్య ట్యూన్ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది.

నోయిస్ మాస్టర్ బడ్స్ 2 నుంచి రెండు రోజుల క్రితం కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) నుంచి ఆవిష్కరించింది. అయితే, ఈ బడ్స్ ఫిబ్రవరి నెలలో గ్లోబల్ మార్కెట్ లో సేల్ కి అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అంతేకాదు, ఈ బడ్స్ ను రెండు కలర్ వేరియంట్స్ లో అందిస్తారని కూడా చెబుతున్నారు.
Also Read: భారీ ఆఫర్స్ తో Republic Day Sale అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
Noise Master Buds 2 : ఏమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు?
ఈ బడ్స్ సౌండ్ కోసం ప్రత్యేకమైనదిగా చెప్పబడే సిరీస్ నుంచి వస్తున్నాయి. అంటే, ఇందులో బోస్ ట్యూన్ తో గొప్ప సౌండ్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాదాపు డిజైన్ లో పెద్ద మార్పులు లేకపోయినా, ఈ బడ్స్ ANC మరియు కాలింగ్ కోసం మరింత కొత్త మెరుగులు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మొత్తానికి, ఈ బడ్స్ కొత్త తరానికి తగిన లేటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ కావచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గత తరం బడ్స్ తో పోలిస్తే ఇందులో మరింత క్వాలిటీ సౌండ్ అందుకోవచ్చని మాత్రం కచ్చితంగా ఊహిస్తున్నారు.