Noise Buds X Ultra: బడ్జెట్ Hybrid ANC ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన నోయిస్.!
నోయిస్ ఈరోజు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది
Noise Buds X Ultra LHDC ఫీచర్ తో లంచ్ అయ్యింది
ఈ బడ్స్ 24 bit / 96 kHz హై క్వాలిటీ సౌండ్ అందిస్తుంది
Noise Buds X Ultra: నోయిస్ ఈరోజు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. అదే బడ్స్ X అల్ట్రా మరియు ఈ బడ్స్ ధరలో Hybrid ANC మరియు LHDC ఫీచర్ తో లంచ్ అయ్యింది. నోయిస్ ఈ లేటెస్ట్ బడ్స్ ను నాలుగు కలర్ ఆప్షన్ లలో అందించింది మరియు ఈ బడ్స్ ను ఈరోజు నుంచే సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.
Noise Buds X Ultra: ప్రైస్
నోయిస్ బడ్స్ X అల్ట్రా బడ్స్ ను రూ. 2,799 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ బడ్స్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 2,599 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ చేసాయి. ఈ బడ్స్ పై Amazon Pay ICICI ఆప్షన్ పై 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ అందించింది. ఈ నోయిస్ బడ్స్ కలిగిన ఫీచర్స్ మరియు ఇతర వివరాలు క్రింద చూడవచ్చు.
Noise Buds X Ultra: ఫీచర్స్
ఈ నోయిస్ బడ్స్ 11mm అల్ట్రా డైనమిక్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ బడ్స్ LHDC ఫీచర్ తో వస్తుంది మరియు ప్రీమియం సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ 24 bit / 96 kHz హై క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. మంచి క్వాలిటీ కాలింగ్ కోసం ఈ బడ్స్ 6 mic ENC సెటప్ కలిగి ఉంటుంది మరియు క్లియర్ కాల్స్ ఆఫర్ చేస్తుందని నోయిస్ తెలిపింది. మంచి సరౌండ్ సౌండ్ కోసం ఈ బడ్స్ స్పటియల్ ఆడియో ఫీచర్ తో కూడా వస్తుంది.
నోయిస్ బడ్స్ X అల్ట్రా బడ్స్ 45 dB హైబ్రిడ్ ANC సపోర్ట్ తో సూపర్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో వస్తుంది. ఈ నోయిస్ బడ్స్ టోటల్ 50 గంటల ప్లే టైమ్ తో వస్తుంది. ఈ బడ్స్ సింగల్ ఛార్జ్ తో 7 గంటల ప్లే టైమ్ మరియు బాక్స్ తో 43 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఈ బడ్స్ Instacharge సపోర్ట్ తో వస్తుంది మరియు 10 నిమిషాల ఛార్జ్ తో 150 మినిట్స్ ప్లే టైమ్ అందిస్తుంది.
Also Read: Smart Tv: 17 వేల ధరలో పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్నారా.!
ఇక ఈ బడ్స్ కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ బడ్స్ డ్యూయల్ డివైజ్ పెయిరింగ్, గూగుల్ ఫాస్ట్ పైర్ మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ హైపర్ సింక్ ఫీచర్ కలిగి ఉంటుంది మరియు IPX5 వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ బడ్స్ ను లాత్ర గేమింగ్ కోసం 65ms లో లేటెన్సీ సపోర్ట్ తో వస్తుంది.