LG Meridian Soundbar పై ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ LG కంపెనీ ఆఫర్ అనౌన్స్ చేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ LG మరియు ప్రపంచ ప్రఖ్యాత ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ Meridian జతగా తీసుకు వచ్చిన పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఎల్ జి ఈ బెస్ట్ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ బాస్ మరియు అద్భుతమైన క్రిస్టల్ క్లియర్ సౌండ్ ను అందిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
LG Meridian Soundbar: ఆఫర్
LG యొక్క మెరీడియన్ సిరీస్ సౌండ్ బార్ LG SP8A ఇండియన్ మార్కెట్లో రూ. 49,990 ధరతో లాంచ్ అవ్వగా, ఈ సౌండ్ బార్ ఈరోజు రూ. 27,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో lg.com/in నుంచి రూ. 22,990 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై భారీ ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 1,764 రూపాయల వరకు అదనపు No Cost EMI ఇంట్రెస్ట్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది.
ఈ ఎల్ జి సౌండ్ బార్ 3.1.2 సెటప్ తో వస్తుంది. ఇందులో ఎదురు మూడు స్పీకర్లు మరియు పైన రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 440W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 20mm సిల్క్ డూమ్ ట్వీటర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Alexa, Spotify, గూగుల్ అసిస్టెంట్ మరియు ఎయిర్ ప్లే2 సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఆప్టికల్, HDMI, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఇక ఈ సౌండ్ బార్ సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ LPCM, DTS డిజిటల్ సరౌండ్, Dolby Atmos, DTS-HD మాస్టర్ ఆడియో మరియు Dolby Digital వంటి అన్ని సౌండ్ టెక్నలాజి సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు AI రూమ్ కాలిబ్రేషన్, అడాప్టివ్ ఆడియో మరియు హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.