G0VO GoSurround 320: ఇన్ బిల్ట్ బ్యాటరీ మరియు 3D Sound తో కొత్త సౌండ్ బార్ లాంచ్.!

HIGHLIGHTS

గోవో ఈరోజు భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ సౌండ్ బార్ ను విడుదల చేసింది

G0VO GoSurround 320 సౌండ్ బార్ ను ఇన్ బిల్ట్ బ్యాటరీతో విడుదల చేసింది

ఈ సౌండ్ బార్ టోటల్ 50W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది

G0VO GoSurround 320: ఇన్ బిల్ట్ బ్యాటరీ మరియు 3D Sound తో కొత్త సౌండ్ బార్ లాంచ్.!

G0VO GoSurround 320: గోవో ఈరోజు భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ కొత్త సౌండ్ బార్ ను ఇన్ బిల్ట్ బ్యాటరీ మరియు నాలుగు స్పీకర్స్ తో విడుదల చేసింది. ఈ కొత్త సౌండ్ బార్ ను ఈరోజు నుంచే సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ కొత్త  సౌండ్ బార్ ప్రైస్ మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

G0VO GoSurround 320: ప్రైస్ 

గోవో గో సరౌండ్ 320 సౌండ్ బార్ ను రూ. 1,999 లాంచ్ ధరతో విడుదల చేసింది. ఈరోజు నుంచే ఈ గోవో సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

G0VO GoSurround 320: ఫీచర్స్ 

గోవో గో సరౌండ్ 320 సౌండ్ బార్ 58mm పోర్టబుల్ స్పీకర్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 50W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ సినిమాటిక్ ఆడియో ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని గోవో తెలిపింది. ఈ కొత్త సౌండ్ బార్ 3D Surround Sound ఫీచర్ తో  వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుందట. 

G0VO GoSurround 320 Features

ఈ సౌండ్ బార్ 4000mAh బిగ్ ఇన్ బిల్ట్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీతో ఈ సౌండ్ బార్ 8 గంటల ప్లే బ్యాంక్ ను అందిస్తుంది. ఈ గోవో సౌండ్ బార్ Dynamic LED Lights తో మంచి యాంబియన్స్ ను ఆఫర్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఈ గో సరౌండ్ 320 సౌండ్ బార్ Aux, USB, TF Card, FM మరియు మరియు Bluetooth 5.3 కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Also Read: iPhone 16 Series Craze: ఐఫోన్ 16 కొనడానికి 12 గంటలు క్యూలో నిలబడిన జనాలు.!

ఈ సౌండ్ బార్ ను మ్యూజిక్ తో పాటు బ్లూటూత్ ద్వారా స్మార్ట్ టీవీ తో కనెక్ట్ చేసి మూవీస్ ను ఎంజాయ్ చేయవచ్చు అని గోవో తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo