iPhone 16 Series Craze: ఐఫోన్ 16 కొనడానికి 12 గంటలు క్యూలో నిలబడిన జనాలు.!
ఈ నెలలో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ లను విడుదల చేసింది
ఈ ఐఫోన్ 16 సిరీస్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి
కొత్త ఐఫోన్ కోసం కుర్రకారు రాత్రి నుంచే యాపిల్ స్టోర్స్ వద్ద లైన్ లో పడిగాపులు కాశారు
iPhone 16 Series Craze: సెప్టెంబర్ 9న నిర్వహించిన అతిపెద్ద యాపిల్ ఈవెంట్ నుంచి యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ లను విడుదల చేసింది. యాపిల్ అందించిన ఈ కొత్త ఐఫోన్ లేటెస్ట్ ఫీచర్స్ మరియు కెమెరా సిస్టం తో ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. ఈ ఐఫోన్ 16 సిరీస్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. అయితే, స్టాక్ అయిపోయే లోగా కొత్త ఫోన్ అందరి కంటే ముందుగా సొంతం చేసుకోవాలని ఉర్రుతలూగుతున్న కుర్రకారు రాత్రి నుంచే ఢిల్లీ మరియు ముంబాయి లో ఉన్న యాపిల్ స్టోర్స్ వద్ద లైన్ లో పడిగాపులు కాశారు.
SurveyiPhone 16 Series Craze:
ఢిల్లీ సిటీలోని సాకేత్ లో (Select Citywalk) వున్న యాపిల్ స్టోర్ ను డిజిట్ సందర్శించింది. ఇక్కడ లైన్ లో వున్న వారితో చేసిన చేసిన ఇంటర్వ్యూలో ఐఫోన్ కొనడానికి 12 గంటలు లైన్లో నిలబడడానికి సిద్ధంగా ఉన్నట్లు చాలా లైన్లో ఉన్న కొనుగోలుదారులు తెలిపారు.
People staying put since 8PM last night. The craze for the iPhone 16 series is at a different level!#Apple #iPhone16 pic.twitter.com/iNptgMdTdU
— Digit (@digitindia) September 20, 2024
ఇక X ప్లాట్ ఫామ్ నుంచి షేర్ అయిన అనేక వీడియోల ద్వారా ఈ ఫోన్ కోసం 12 గంటల కంటే ఎక్కువ సమయం లైన్ లో పడిగాపులు కాసిన వారు కూడా ఉన్నారు. ఐఫోన్ కొనడానికి కిడ్నీ పోగొట్టుకున్న కథనాలు గతంలో చాలా చూశాము. అయితే, ఇప్పుడు ఇంకెన్ని కొత్త కథనాలు చూడాల్సి వస్తుందో అని ప్రజలు చెవులు కోరుకుంటున్నారు.
Also Read: WhatsApp upcoming: యూజర్స్ కోసం Chat Filters ఫీచర్స్ తెస్తున్న వాట్సాప్.!
అయితే, గతంతో పోలిస్తే ఐఫోన్ 16 సిరీస్ మాత్రం రిజనబుల్ ధరలో మరిన్ని ఫీచర్స్ తో వచ్చాయి. ఈ కొత్త ఐఫోన్ సిరీస్ లో స్పెషల్ కెమెరా కస్టమైజ్ బటన్ మరియు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో పాటు సరికొత్త iOS 18 వంటి ఫీచర్స్ ఉన్నాయి.
The Apple Store at Saket in Delhi saw long lines as people waited to get their hands on the newly launched iPhone 16 series.#Apple #iPhone16 pic.twitter.com/wd7iWVGJ9f
— Digit (@digitindia) September 20, 2024
iPhone 16 series sale kicks off in India today, here are the visuals straight from Apple Store, BKC. #apple #iphone16 #sale #iphone16pro pic.twitter.com/Zgd9hFks0L
— Digit (@digitindia) September 20, 2024