LG 9.1.5 ఛానల్ Soundbar పై భారీ డిస్కౌంట్ అందించిన Flipkart

HIGHLIGHTS

Flipkart Big Diwali Sale నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది

LG యొక్క పవర్ ఫుల్ Soundbar పై ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది

డిస్కౌంట్ దెబ్బకు ఈ LG సౌండ్ బార్ ఈరోజు సగం ధరకే లభిస్తుంది

LG 9.1.5 ఛానల్ Soundbar పై భారీ డిస్కౌంట్ అందించిన Flipkart

Flipkart లేటెస్ట్ పండుగ సేల్ Big Diwali Sale నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG యొక్క పవర్ ఫుల్ Soundbar పై ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన డిస్కౌంట్ దెబ్బకు ఈ LG సౌండ్ బార్ ఈరోజు సగం ధరకే లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ పవర్ ఫుల్ సౌండ్ డీల్ ను గురించి విపులంగా తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG 9.1.5 Soundbar : ఆఫర్

LG యొక్క 9.1.5 ఛానల్ సౌండ్ బార్ LG S95QR ఈరోజు 59% భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఈ భారీ డిస్కౌంట్ తో రూ. 56,999 రూపాయల ధరకి లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ రెండు ఆఫర్స్ తో ఈ LG సౌండ్ బార్ ఈరోజు రూ. 55,499 రూపాయల ఆఫర్ ధరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుంచి లభిస్తుంది.

Also Read: మంచి డిస్కౌంట్ తో రూ. 1,500 ధరలో అమెజాన్ సేల్ నుంచి కొనతగిన బెస్ట్ TWS Buds ఇవే.!

LG 9.1.5 Soundbar : ఫీచర్స్

ఈ LG సౌండ్ బార్ పవర్ ఫుల్ స్పీకర్లు మరియు కంప్లీట్ సెటప్ తో వస్తుంది. మూడు అప్ ఫైరింగ్ స్పీకర్లతో వచ్చిన మొదటి సౌండ్ బార్ గా దీనికి రికార్డు కూడా వుంది. ఈ సౌండ్ బార్ మూడు అప్ ఫైరింగ్ స్పీకర్స్ (45Wx3), 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు (45Wx3), 2 సైడ్ ఫైరింగ్ స్పీకర్లు (45Wx2 ) కలిగిన బార్, 1 ఫ్రంట్ 45W మరియు 1 అప్ ఫైరింగ్ 45W స్పీకర్స్ కలిగిన 2 రియర్ శాటిలైట్ స్పీకర్స్ ఇందులో ఉన్నాయి. ఈ సౌండ్ బార్ 220W హెవీ BASS అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ను కూడా కలిగి ఉంటుంది.

LG 9.1.5 Soundbar

ఈ LG సౌండ్ బార్ టోటల్ 810 W హెవీ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos, DTS:X, IMAX Enhanced, AI Sound Pro సౌండ్ సపోర్ట్ లతో పాటు Meridian సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కూడా కలిగి వుంది. ఈ సౌండ్ బార్ లో అద్భుతమైన సినిమా అనుభూతిని మీ ఇంట్లోనే అందిస్తుంది. అంతేకాదు, ఇది అన్ని రకాల DOLBY ఫార్మాట్ మరియు dts ఫార్మాట్ లకు సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo