Flipkart సేల్ నుంచి అతితక్కువ ధరకే Dolby Atmos సౌండ్ బార్

HIGHLIGHTS

Flipkart బిగ్ దివాళీ సేల్ మంచి ఆఫర్లను తీసుకొచ్చింది.

ఈ దివాళీ సేల్ నుంచి చాలా ప్రోడక్ట్స్ పైన గొప్ప ఆఫర్లను అందుకోవచ్చు.

Dolby Atmos తో మీ సంగీత మరియు సినిమా వినోదాన్ని మరింత పెంచుకోవచ్చు.

Flipkart సేల్ నుంచి అతితక్కువ ధరకే Dolby Atmos సౌండ్ బార్

Flipkart బిగ్ దివాళీ సేల్ మంచి ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ దివాళీ సేల్ నుంచి చాలా ప్రోడక్ట్స్ పైన గొప్ప ఆఫర్లను అందుకోవచ్చు. అయితే, ఒక మంచి సౌండ్ సిస్టం లేదా సౌండ్ బార్ కోసం చూస్తున్న వారికీ మాత్రం ఒక మంచి అఫర్ ని తీసుకొచ్చాను. అదేమిటంటే, ఇటీవల Zebronics తక్కువ ధరలో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ మద్దతుతో లాంచ్ చేసిన Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌ ను రూ.2,000 డిస్కౌంట్ తో అమ్ముడు చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈ సేల్ నుండి కేవలం రూ.15,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఆడియో సిస్టమ్ బ్రాండ్ అయిన Zebronics ఇటీవల భారతదేశంలో ఈ Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌ విడుదల చేసింది. సెప్టెంబర్ 2020 లో వచ్చిన ఈ సౌండ్ బార్ రూ .17,999 ధరతో వచ్చింది. ప్రస్తుతం ఈ Flipkart సేల్ నుండి రూ.15,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. Check Offer Here 

అధనంగా, Axis బ్యాంకు డెబిట్/క్రెడిట్ కార్డుతో ఈ సౌండ్ బార్ కొనేవారికి డిస్కౌంట్ లభిస్తుంది. Bajaj Fin Serv మరియు Flikart Axis Bank కస్టమర్లకు No Cost EMI కూడా వుంది.                  

Zeb-Juke Bar 9700 Pro ప్రత్యేకతలు

 ఈ సౌండ్ బార్‌లో 6.5 ఇంచ్ సబ్‌ వూఫర్ స్పీకర్ మరియు క్వాడ్ 2.24 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. ఇది సౌండ్‌బార్‌తో పాటు సబ్‌ వూఫర్ యూనిట్‌తో కూడా వస్తుంది. ఈ సౌండ్‌బార్ 450W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు 45Hz నుండి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంది.

Dolby Atmos తో మీ సంగీత మరియు సినిమా వినోదాన్ని మరింత పెంచుకోవచ్చు. అంతేకాదు, Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. Dolby Atmos ‌తో మీ వినోదాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడం గతంలో కంటే చాలా సులభం. Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.

అలాగే, మల్టీ ఛానల్ సరౌండ్ సెట్టింగ్ కోసం వైర్లతో కూడిన స్పీకర్లతో చిక్కుబడ్డ గజిబిజిని తప్పించుకోవచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్‌బార్ సరళమైన డిజైన్‌లో సూపర్ సౌండ్ అందించేలా రూపొందించబడింది. ఇది ఎటువంటి వైర్‌ అవసరం లేకుండా, లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది మరియు చాలా సులభమైన సెటప్ తో వస్తుంది.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, సౌండ్‌బార్‌లో ఇబ్బంది లేని సెటప్ మాత్రమే కాదు, మల్టి-కనెక్టివిటీ ఎంపికలతో కనెక్ట్ అవ్వడానికి చాలా సులభమైన మార్గం అందించింది.  USB / AUX ఉపయోగించి మీ ఫోన్‌ను వైర్‌లెస్‌గా ప్రసారం చెయ్యవచ్చు. మీరు HDMI (ARC) లేదా ఆప్టికల్ ఇన్‌పుట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు మరియు ఇబ్బంది లేకుండా కనెక్ట్ చేయవచ్చు. సౌండ్ బార్ ఒక HDMI అవుట్‌పుట్‌తో పాటు డ్యూయల్ HDMI ఇన్‌పుట్‌తో వస్తుంది.

అతి తక్కువ ధరకే బ్రాండెడ్ Sound Bar Offers కోసం ఇక్కడ నొక్కండి. ప్రారంభ ధర కేవలం రూ.2,999 రూపాయల నుండి మొదలు.         

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo