Boult X Mustang సిరీస్ నుంచి మూడు కొత్త ఆడియో ప్రొడక్ట్స్ విడుదల చేసింది. ముస్తాంగ్ సిరీస్ నుంచి లిమిటెడ్ ఎడిషన్ బడ్స్ టార్క్ ఎల్లో, హెడ్ ఫోన్ ముస్తాంగ్ Q మరియు ముస్తాంగ్ డైనో ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఈ మూడు బడ్స్ ను ఈరోజు నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.
Survey
✅ Thank you for completing the survey!
Boult X Mustang : ప్రైస్
బోల్ట్ ముస్తాంగ్ సిరీస్ నుంచి లాంచ్ చేసిన లిమిటెడ్ ఎడిషన్ బడ్స్ టార్క్ ఎల్లో బడ్స్ ను రూ. 1,499 రూపాయల ధరతో, ముస్తాంగ్ Q హెడ్ ఫోన్ ను రూ. 2,499 ధరతో లాంచ్ చేసింది. అలాగే, ముస్తాంగ్ డైనో ఇయర్ బడ్స్ ను రూ. 1299 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ మూడు బడ్స్ కూడా సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.
బోల్ట్ ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను కస్టమైజ్డ్ ఈక్వలైజర్ మరియు బోల్ట్ AMP APP కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ ను లేటెస్ట్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ తో అందించింది. ఈ బడ్స్ 60 Hours ప్లే టైమ్, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 13mm స్పీకర్లు, IPX5 వాటర్ రెసిస్టెంట్ మరియు AI వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Mustang Q
బోల్ట్ ఈ హెడ్ ఫోన్ ను 40mm బూస్టెడ్ స్పీకర్లు మరియు సుప్రీమ్ BASS సౌండ్ సపోర్ట్ తో అందించింది. ఈ హెడ్ ఫోన్ Zen Mode ఎన్విరాన్మెంటల్ నోయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, IP67 వాటర్ రెసిస్టెంట్ మరియు ANC సపోర్ట్ తో వస్తుంది. ఈ హెడ్ ఫోన్ ను డ్యూయల్ మోడ్ మరియు కంఫర్ట్ అందించింది.
ఈ కొత్త ఇయర్ బడ్స్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ అందించింది. ఈ బడ్స్ బిల్ట్ ఇన్ AMP App మరియు సుప్రీమ్ BASS అందించే 13mm స్పీకర్స్ తో అందించింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ 60 గంటల ప్లే టైమ్, క్వాడ్ మైక్ ENC, డ్యూయల్ డివైజ్ పైరింగ్, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, IPX5 వాటర్ రెసిస్టెంట్ మరియు 45ms అల్ట్రా లో లెటెన్సీ మోడ్ వంటి ఫీచర్స్ తో అందించింది.