boAt Airdopes 141 Pro: సరికొత్త మెటాలిక్ ఫినిష్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న బోట్.!
boAt Airdopes 141 Pro బడ్స్ యొక్క మెటాలిక్ ఫినిష్ డిజైన్ సిరీస్ బోట్ లాంచ్ చేస్తోంది
డిసెంబర్ 5వ తేదీ నుంచి ఈ బడ్స్ సేల్ కి కూడా అందుబాటులోకి వస్తాయి
బోట్ ఎయిర్ డోప్స్ 141 ప్రో ఇయర్ బడ్స్ లాంచ్ కంటే ముందే ధర అనౌన్స్ చేసింది
boAt Airdopes 141 Pro బడ్స్ యొక్క మెటాలిక్ ఫినిష్ డిజైన్ సిరీస్ బోట్ లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను డిసెంబర్ 5న లాంచ్ చేస్తున్నట్లు బోట్ ప్రకటించింది. కేవలం డేట్ ప్రకటించడం మాత్రమే కాదు ఈ ఫోన్ యొక్క ప్రైస్ తో పాటు ఫీచర్స్ ని కూడా కంపెనీ ముందే ప్రకటించింది. అయితే, డిసెంబర్ 5వ తేదీ నుంచి ఈ బడ్స్ సేల్ కి కూడా అందుబాటులోకి వస్తాయి.
SurveyboAt Airdopes 141 Pro: ధర మరియు లాంచ్
బోట్ ఎయిర్ డోప్స్ 141 ప్రో ఇయర్ బడ్స్ లాంచ్ కంటే ముందే ధర అనౌన్స్ చేసింది. ఈ బడ్స్ ను రూ. 1,299 ధరతో ప్రకటించింది మరియు ఈ బడ్స్ ను డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ బడ్స్ ను నాలుగు కొత్త కలర్స్ లో లాంచ్ చేస్తున్నట్లు కూడా టీజింగ్ చేస్తోంది.
Also Read: Flipkart Sale నుంచి సగం ధరకే లభిస్తున్న SAMSUNG Galaxy S23 5G స్మార్ట్ ఫోన్.!
boAt Airdopes 141 Pro: ఫీచర్స్
బోట్ ఎయిర్ డోప్స్ 141 ప్రో ఇయర్ బడ్స్ ను కొత్త మెటాలిక్ ఫినిష్ డిజైన్ తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ ను 13mm స్పీకర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ బడ్స్ భూమింగ్ BASS మరియు క్రిస్టల్ క్లియర్ హైస్ తో మంచి రిచ్ సౌండ్ అందిస్తుందని కూడా బోట్ తెలిపింది. ఈ బడ్స్ ఇన్స్టా వాక్ పెయిర్ (IWP) సపోర్ట్ తో కూడా వస్తుంది. కేస్ ఓపెన్ చేయగానే ఈ బడ్స్ వెంటనే కనెక్ట్ అవుతుంది.

అలాగే, క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందించడానికి వీలుగా ఈ బడ్స్ లో క్వాడ్ మైక్స్ ENx టెక్నాలజీ సపోర్ట్ ను అందించినట్లు బోట్ వెల్లడించింది. ఇక ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బోట్ బడ్స్ బాక్స్ తో కలిపి పూర్తిగా 60 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ బోట్ బడ్స్ ASAP ఛార్జ్ టెక్ తో కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో 180 నిముషాల ప్లే టైమ్ అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
