Flipkart Sale నుంచి ఈరోజు SAMSUNG Galaxy S23 5G స్మార్ట్ ఫోన్ దాదాపు సగం ధరకే లభిస్తోంది. బ్లాక్ ఫ్రైడే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ సేల్ ఈరోజు అర్ధరాత్రి తో ముగియనుండగా ఈ భారీ ఆఫర్ ను చివరి క్షణాల్లో ప్రకటించింది.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Sale SAMSUNG Galaxy S23 5G : డీల్
ఇండియాలో రూ. 74,999 ప్రారంభ ధరతో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ S23 5జి స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో రూ. 38,999 ధరకే సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Flipkart Axis Bank Credit ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 8GB ర్యామ్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక ప్రీమియం ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ + 10MP టెలిఫోటో + 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 8K UHD వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు గెలాక్సీ AI సపోర్ట్ తో గొప్ప ఫోటో ఎడిటింగ్ ఆప్షన్ లను కొద అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 స్మార్ట్ ఫోన్ లో 12MP సెల్ఫీ కెమెరా వుంది. 3900 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో శాంసంగ్ అందించింది. ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి దాదాపు సగం ధరకే ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అందుకోవచ్చు.