HMD Fusion: హెచ్ఎండి తెచ్చిన కస్టమైజబుల్ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

HMD Fusion: హెచ్ఎండి తెచ్చిన కస్టమైజబుల్ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!
HIGHLIGHTS

HMD కస్టమైజబుల్ 5జి స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రాబోతుంది

HMD Fusion లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి డిస్కౌంట్ ఆఫర్ అందించింది

లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ లో భాగంగా రూ. 15,999 ధరకే అందుకోవచ్చని HMD తెలిపింది

HMD Fusion: హెచ్ఎండి ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన కస్టమైజబుల్ 5జి స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రాబోతుంది. సాధారణ సాంప్రదాయ స్మార్ట్ ఫోన్ పరిధిని దాటి కొత్త ఫీచర్స్ తీసుకు వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్స్ ను కూడా అందించింది. రేపు మొదటి సారిగా సేల్ కు అందుబాటులోకి రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, ఆఫర్లు మరియు ఫీచర్స్ తెలుసుకోండి.

HMD Fusion: ప్రైస్

హెచ్ఎండి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను రూ. 17,999 ధరతో లాంచ్ చేసింది. అయితే లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి డిస్కౌంట్ ఆఫర్ అందించింది. రేపు జరగనున్న మొదటి సేల్ నుంచి ఈ ఫోన్ ను లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ లో భాగంగా రూ. 15,999 ధరకే అందుకోవచ్చని HMD తెలిపింది.

సేల్

ఈ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి హెచ్ఎండి వెబ్సైట్ మరియు అమెజాన్ ఇండియా నుంచి సేల్ అప్ అవుతుంది.

HMD Fusion: ఫీచర్స్

హెచ్ఎండి ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను కస్టమర్ డిజైన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను గేమింగ్ ప్యాడ్ తో అటాచ్ చేసుకోవచ్చు మరియు ఈ ప్యాడ్ గొప్ప లైట్ తో పాటు జతగా వస్తుంది. ఈ ఫోన్ ను Snapdragon 4 Gen 2 చిప్ సెట్, 8GB ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ తో అందించింది. ఈ ఫోన్ ను 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా అందించింది.

HMD Fusion launched in India

ఈ HMD కొత్త స్మార్ట్ ఫోన్ వెనుక 108MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు 50MP సెల్ఫీ కెమెరా ని కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 OS తో వస్తుంది మరియు 2 మేజర్ అప్గ్రేడ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo