ZEBRONICS 5.1 Dolby soundbar పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ యొక్క లాంచ్ ధరతో పోలిస్తే ఈరోజు అందుబాటులో ఉన్న ఆఫర్స్ తో చాలా చవక ధరలో లభిస్తుంది. ఇది 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు తమ లిస్ట్ లో చేర్చదగిన ఈ సౌండ్ బార్ డీల్. అందుకే, ఈ లేటెస్ట్ బడ్జెట్ బెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ డీల్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాను.
Survey
✅ Thank you for completing the survey!
ZEBRONICS 5.1 Dolby soundbar డీల్ ఏమిటి?
జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ 5.1 ఛానల్ సౌండ్ బార్ Juke Bar 9400 Pro ఈ రోజు బెస్ట్ డిస్కౌంట్ అందుకున్న సౌండ్ బార్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 77% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,499 ధరలో సేల్ అవుతోంది. అలాగే, ఈ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 849 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో జెబ్రోనిక్స్ 5.1 ఛానల్ సౌండ్ బార్ కేవలం రూ. 7,650 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సౌండ్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఐరన్ గ్రిల్స్ తో మంచి ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది మరియు వాల్ మౌంట్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ 45 – 20000 Hz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తో మంచి డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది.
ఈ 5.1 ఛానల్ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డాల్బీ డిజిటల్ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 525W జబర్దస్త్ సౌండ్ తో ఇంటిని షేక్ చేస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ అందుకుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.