భారీ ఆఫర్స్ తో మొదలైన Lava Play Ultra 5G మొదటి సేల్.!

HIGHLIGHTS

Lava Play Ultra 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది

లావా ఈ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకువచ్చింది

ఈ ఫోన్ చవక ధరలో గేమింగ్ ఫీచర్స్ తో మార్కెట్లో లాంచ్ అయ్యింది

భారీ ఆఫర్స్ తో మొదలైన Lava Play Ultra 5G మొదటి సేల్.!

లావా ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన Lava Play Ultra 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. లావా ఈ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ చవక ధరలో గేమింగ్ ఫీచర్స్ తో మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు ఫీచర్లు గురించి వివరంగా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Play Ultra 5G : ప్రైస్ అండ్ ఆఫర్స్

లావా ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB+128GB) ని కేవలం రూ. 14,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (8GB+128GB) ని రూ. 16,499 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

Lava Play Ultra 5G Offers

ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతుంది. అన్ని ప్రధాన బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డు పై రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లాంచ్ ఆఫర్ లో భాగంగా లావా అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 13,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో లభిస్తుంది.

Lava Play Ultra 5G : ఫీచర్స్

లావా ప్లే అల్ట్రా స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు సన్నని అంచులు కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 12GB వరకు ఎక్స్ పాండబుల్ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ బ్లోట్ వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది మరియు 2 సంవత్సరాల మేజర్ అప్డేట్స్ తో పాటు 3 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది.

Lava Play Ultra 5G Top Features

ఈ స్మార్ట్ ఫోన్ లో 64MP Sony IMX682 మెయిన్ సెన్సార్ జతగా 5MP మ్యాక్రో సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ EIS సపోర్ట్ తో వస్తుంది మరియు 4K వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో టైమ్ లాప్స్, HDR మోడ్ మరియు నైట్ మోడ్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: Realme P4 5G: రూ. 3,500 భారీ ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదలైన సేల్.!

ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, లావా ప్లే అల్ట్రా లో 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ప్లే అల్ట్రా ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ నోయిస్ క్యాన్సిల్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ మైక్ మరియు మంచి సౌండ్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo