Amazon GIF Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి జబర్దస్త్ స్మార్ట్ స్పీకర్ డీల్ అనౌన్స్ చేసింది. అమెజాన్ పండుగ సీజన్ సేల్ అర్లీ బర్డ్ డీల్స్ లో భాగంగా ఈ డీల్ ను అనౌన్స్ చేసింది. అమెజాన్ ప్రకటించిన ఈ డీల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే చాలా ముందుగా అందుబాటులోకి వస్తుంది. ఈ బిగ్ డీల్స్ తో Amazon Echo Pop స్మార్ట్ స్పీకర్ ని కేవలం రూ. 2,949 ఆఫర్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
Amazon GIF Sale: Amazon Echo Pop Deal
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం చేస్తున్న ప్రమోషన్ లో భాగంగా ఈ డీల్ ను అనౌన్స్ చేసింది. ఇక డీల్ విషయానికి వస్తే, అమెజాన్ సేల్ అర్లీ బర్డ్ డీల్స్ లో భాగంగా ఈ స్మార్ట్ స్పీకర్ డీల్ అందించింది మరియు ఈ డీల్ సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం రూ. 4,499 రూపాయల ధరలో సేల్ అవుతున్న ఈ అమెజాన్ ఎకో పాప్ స్మార్ట్ స్పీకర్ ను సేల్ నుంచి కేవలం రూ. 2,949 రూపాయల ఆఫర్ ధరకే అందుకోండి, అని అమెజాన్ ప్రకటించింది. ఈ స్మార్ట్ స్పీకర్ పై అందించిన అన్ని ఆఫర్స్ తో ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ దీపావళి మరియు దసరా పండుగ సందర్భంగా కొత్త స్మార్ట్ స్పీకర్ కోసం చూస్తుంటే, ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
అమెజాన్ ఎకో పాప్ అప్ స్మార్ట్ స్పీకర్ డీప్ BASS, క్లియర్ వోకల్స్ మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందించే స్పీకర్ మరియు సెటప్ కలిగి ఉంటుంది. ఇది స్మార్ట్ స్పీకర్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi సెటప్ తో వస్తుంది. అంతేకాదు, ఈ స్పీకర్ బ్లూటూత్ కనెక్టివిటీ తో మీ స్మార్ట్ ఫోన్ లేదా టీవీకి కనెక్ట్ చేసే ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ అమెజాన్ స్మార్ట్ స్పీకర్ Alexa సపోర్ట్ తో వస్తుంది మరియు జస్ట్ మీరు ఇచ్చే వాయిస్ కమాండ్ తో అన్ని పనులు చేస్తుంది.
ఈ అమెజాన్ స్మార్ట్ స్పీకర్ నాలుగు అందమైన రంగుల్లో లభిస్తుంది. ఇది మీ స్మార్ట్ డివైజ్ లను నడిపించే శక్తి కలిగి ఉంటుంది. అంటే, స్మార్ట్ టీవీ, AC మరియు గీజర్ వంటి స్మార్ట్ పరికరాలు మీరు చెప్పిన టైమ్ కు నడిచేలా చేస్తుంది. ముఖ్యంగా, ఆన్లైన్ సాంగ్స్ ప్లే చేయడంలో మీకు గొప్ప మ్యూజిక్ పార్ట్నర్ గా ఉంటుంది.