5.1 Soundbar deal under rs 4000 today available in flipkart
రూ. 4,000 బడ్జెట్ లో 5.1 Soundbar సౌండ్ బార్ కావాలా, మీకు ఈ ధరలో కూడా లేటెస్ట్ సౌండ్ బార్ అందుబాటులో ఉంది. కాంపాక్ట్ డిజైన్ మరియు HDMI Arc వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో ఈ సౌండ్ బార్ వస్తుంది. బడ్జెట్ ధరలో, కేవలం 4 వేల రూపాయల ధరలో కొత్త 5.1 ఛానల్ సౌండ్ బార్ కోరుకునే యూజర్లు ఈ సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు. అయితే, ‘పిండి కొద్దీ రొట్టె’ అనే సామెత మాత్రం మర్చిపోకండి.
ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఆఫర్ మీకు ఈ రోజు అందుబాటులో ఉంది. అదేమిటంటే, GOVO కొత్తగా విడుదల చేసిన Go Surround 690 సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 74% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ ఆఫర్ తో ఈ ప్రైస్ లో లభిస్తున్న ఏకైక 5.1 ఛానల్ సౌండ్ బార్ గా ఇది ఈరోజు లిస్ట్ లో నిలిచింది. ఈ సౌండ్ బార్ ను మీరు ఫ్లిప్ కార్ట్ నుంచి చెక్ చేయవచ్చు. పైన అందించిన మోడల్ నెంబర్ ద్వారా ఫ్లిప్ కార్ట్ లో సెర్చ్ చేయండి.
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 120w అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది చాలా చిన్న సైజు బార్ తో చాలా కాంపాక్ట్ సైజులో వస్తుంది. అయితే, ఈ కాంపాక్ట్ బార్ లో కూడా మూడు స్పీకర్లు ఉంటాయి. అలాగే, ఈ సెటప్ లో డ్యూయల్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్ మరియు మంచి బాస్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటాయి. ఇది కాంపాక్ట్ అండ్ ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది.
ఈ సౌండ్ బార్ లో డాల్బీ లేదా డీటీఎస్ వంటి అదనపు సౌండ్ ఫీచర్స్ లేవని గమనించాలి. అయితే, ఇది స్మార్ట్ టీవీతో జతగా మంచి సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, బ్లూటూత్, USB, ఆప్టికల్ మరియు AUX వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ వచ్చే బడ్జెట్ ప్రైస్ లో డబ్బుకు తగిన విలువ అందిస్తుంది.
Also Read: boltt ACE 5G రేపు లాంచ్ అవుతుంది .. ఈ ఫోన్ పూర్తి ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి కేవలం 3.4 రేటింగ్ మాత్రమే అందుకుంది. కాబట్టి, ఈ సౌండ్ బార్ ని కొనుగోలు చేసే ముందుగా రివ్యూలు చెక్ చేయడం మంచిది. అయితే, మీ టీవీతో వచ్చే బిల్ట్ ఇన్ స్పీకర్ కంటే మంచి సౌండ్ ను ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో మీకు ఇది అందిస్తుంది.