రూ. 4,000 బడ్జెట్ లో 5.1 Soundbar కావాలా .. జస్ట్ లుక్ హియర్.!
రూ. 4,000 బడ్జెట్ లో 5.1 Soundbar సౌండ్ బార్ అందుబాటులో ఉంది
కేవలం 4 వేల ధరలో కొత్త 5.1 ఛానల్ సౌండ్ బార్ కోరుకునే యూజర్లు ఈ సౌండ్ బార్ పరిశీలించవచ్చు
ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఆఫర్ మీకు ఈ రోజు అందుబాటులో ఉంది
రూ. 4,000 బడ్జెట్ లో 5.1 Soundbar సౌండ్ బార్ కావాలా, మీకు ఈ ధరలో కూడా లేటెస్ట్ సౌండ్ బార్ అందుబాటులో ఉంది. కాంపాక్ట్ డిజైన్ మరియు HDMI Arc వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో ఈ సౌండ్ బార్ వస్తుంది. బడ్జెట్ ధరలో, కేవలం 4 వేల రూపాయల ధరలో కొత్త 5.1 ఛానల్ సౌండ్ బార్ కోరుకునే యూజర్లు ఈ సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు. అయితే, ‘పిండి కొద్దీ రొట్టె’ అనే సామెత మాత్రం మర్చిపోకండి.
Survey5.1 Soundbar: ఆఫర్
ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఆఫర్ మీకు ఈ రోజు అందుబాటులో ఉంది. అదేమిటంటే, GOVO కొత్తగా విడుదల చేసిన Go Surround 690 సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 74% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ ఆఫర్ తో ఈ ప్రైస్ లో లభిస్తున్న ఏకైక 5.1 ఛానల్ సౌండ్ బార్ గా ఇది ఈరోజు లిస్ట్ లో నిలిచింది. ఈ సౌండ్ బార్ ను మీరు ఫ్లిప్ కార్ట్ నుంచి చెక్ చేయవచ్చు. పైన అందించిన మోడల్ నెంబర్ ద్వారా ఫ్లిప్ కార్ట్ లో సెర్చ్ చేయండి.
GOVO 5.1 Soundbar: ఫీచర్స్
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 120w అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది చాలా చిన్న సైజు బార్ తో చాలా కాంపాక్ట్ సైజులో వస్తుంది. అయితే, ఈ కాంపాక్ట్ బార్ లో కూడా మూడు స్పీకర్లు ఉంటాయి. అలాగే, ఈ సెటప్ లో డ్యూయల్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్ మరియు మంచి బాస్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటాయి. ఇది కాంపాక్ట్ అండ్ ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

ఈ సౌండ్ బార్ లో డాల్బీ లేదా డీటీఎస్ వంటి అదనపు సౌండ్ ఫీచర్స్ లేవని గమనించాలి. అయితే, ఇది స్మార్ట్ టీవీతో జతగా మంచి సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, బ్లూటూత్, USB, ఆప్టికల్ మరియు AUX వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ వచ్చే బడ్జెట్ ప్రైస్ లో డబ్బుకు తగిన విలువ అందిస్తుంది.
Also Read: boltt ACE 5G రేపు లాంచ్ అవుతుంది .. ఈ ఫోన్ పూర్తి ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి కేవలం 3.4 రేటింగ్ మాత్రమే అందుకుంది. కాబట్టి, ఈ సౌండ్ బార్ ని కొనుగోలు చేసే ముందుగా రివ్యూలు చెక్ చేయడం మంచిది. అయితే, మీ టీవీతో వచ్చే బిల్ట్ ఇన్ స్పీకర్ కంటే మంచి సౌండ్ ను ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో మీకు ఇది అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
