AI Image కోసం WhatsApp లో కొత్త ఫీచర్ .. ఇక ఫోటోలు మాములుగా ఉండవు.!

AI Image కోసం WhatsApp లో కొత్త ఫీచర్ .. ఇక ఫోటోలు మాములుగా ఉండవు.!
HIGHLIGHTS

క్కడ చూసినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది

AI Image కోసం WhatsApp కూడా కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది

ఇమేజ్ లను యూజర్ లకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చని వాట్సాప్ చెబుతోంది

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేక పనులను సులభతరం చేసింది. అందుకే, ఈ ఫీచర్ ను అందిచడానికి యావత్ ప్రపంచం పరుగులు పెడుతోంది. అందుకే, AI Image కోసం WhatsApp కూడా కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఈ కొత్త ఫీచర్ తో కేవలం ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా ఇమేజ్ లను యూజర్ లకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చని వాట్సాప్ చెబుతోంది.

ఏమిటి ఈ WhatsApp AI Image ఫీచర్?

ఫోటో ఎడిటింగ్ కోసం వాట్సాప్ కొత్త AI ఫోటో ఎడిట్ ఫీచర్ ని పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ తో కేవలం ప్రాంప్ట్ కమాండ్ తో నచ్చిన ఇమేజ్ లను ఎడిట్ చేసుకొని కొత్తగా క్రియేట్ చేసుకునే వీలుంది. వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ కోసం Meta AI ని ఉపయోగిస్తుందని కూడా వాట్సాప్ తెలియ చేసింది. దీని అర్ధం ఏమిటంటే, artificial intelligence (AI) నీ ఉపయోగించి కోరిన ఇమేజ్ లను వాట్సాప్ కొత్త క్రియేటివ్ ఇమేజ్ గా తయారు చేసి ఇస్తుంది.

ఈ ఫీచర్ ను ఎలా వినియోగించాలి?

వాట్సప్ కొత్తగా తీసుకు వచ్చిన ఈ కొత్త ఫీచర్ ను వినియోగించడం చాలా సులభం. ఈ కొత్త AI ఇమేజ్ ఎడిట్ ఫీచర్ తో చాలా సులభంగా ఇమేజ్ లను కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ లను క్రియేట్ చేయడానికి, ముందుగా వాట్సాప్ చాట్ లోకి వెళ్లి మెసేజ్ ఫీల్డ్ లో ‘@’ అని టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తరువాత click /imagine ఆప్షన్ ద్వారా కావాల్సిన ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసిన తరువాత మీరు అందించిన ఇమేజ్ ని ఎలా మార్చాలనుకుంటున్నారనే విషయాన్ని మెసేజ్ ఫీల్డ్ లో టైప్ చేసి సెండ్ బటన్ పైన నొక్కండి.

WhatsApp AI image Create
WhatsApp AI image Create

ఆ తరువాత మీరు అందించిన ఇమేజ్ యొక్క కొత్త AI ఇమేజ్ జనరేట్ అవుతుంది మరియు చాట్ లో ప్రత్యక్షమవుతుంది. అంతేకాదు, ఈ ఇమేజ్ లో ఏదైనా తప్పులు ఉన్నా లేక ఈ ఇమేజ్ నచ్చక పోయినా ఈ ఇమేజ్ ను అప్డేట్ కూడా చేసుకునే అవకాశం కూడా వుంది.

Also Read: ఆన్లైన్ లీకైన OnePlus Nord CE4 5G ధర మరియు ఫీచర్స్.!

ఈ ఎఐ ఇమేజ్ ను ఎలా అప్డేట్ చేసుకోవాలి?

మీరు క్రియేట్ చేసిన ఎఐ మీకు ఇమేజ్ మీకు నచ్చక పొతే ఈ ఇమేజ్ ను అప్డేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ అప్డేట్ చెయ్యడం కోసం మీరు క్రియేట్ చేసిన ఎఐ ఇమేజ్ పైన నొక్కి Next వెళ్ళాలి. నెక్స్ట్ కి వెళ్లిన తరువాత Reply పైన క్లిక్ చేయండి. తరువాత, మెసేజ్ ఫీల్డ్ లో కొత్త ప్రాంప్ట్ టైప్ చేసి సెండ్ చెయ్యాలి. ఇలా చేస్తే అప్డేటెడ్ కొత్త ఇమేజ్ క్రియేట్ చెయ్యబడుతుంది.

WhatsApp AI image Update
WhatsApp AI image Update

వాస్తవానికి, ఈ వాట్సాప్ ఎఐ ఫీచర్ ప్రస్తుతానికి అందరికి అంధుబాటులోకి రాలేదు. ఇది కొన్ని దేశాలలోని యూజర్లకు మాత్రమే అంధుబాటులోకి వచ్చింది. భారత్ లో మాత్రం ఈ ఫీచర్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందని తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo