ఇక Instagram నుండి ప్రోడక్ట్స్ ని డైరెక్ట్ గా సేల్ చేసే అవకాశం

ఇక Instagram నుండి ప్రోడక్ట్స్ ని డైరెక్ట్ గా సేల్ చేసే అవకాశం
HIGHLIGHTS

వచ్చే నెలలో ప్రారంభమయ్యే ప్లాట్‌ఫామ్ ద్వారా క్రేయేటర్స్ తమ సరుకులను నేరుగా విక్రయించడానికి ఇన్‌స్టాగ్రామ్ అనుమతిస్తుంది.

Facebook యాజమాన్యంలోని ఈ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ Instagram Shopping ‌ను కొత్త కమర్షియల్ అర్హతలతో, మరిన్ని రకాలలైన వ్యాపారాలకు యాక్సెస్ ను విస్తరించింది.

వచ్చే నెలలో ప్రారంభమయ్యే ప్లాట్‌ఫామ్ ద్వారా క్రేయేటర్స్ తమ సరుకులను నేరుగా విక్రయించడానికి ఇన్‌స్టాగ్రామ్ అనుమతిస్తుంది. Facebook యాజమాన్యంలోని ఈ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్  Instagram Shopping ‌ను కొత్త కమర్షియల్ అర్హతలతో, మరిన్ని రకాలలైన వ్యాపారాలకు యాక్సెస్ ను విస్తరించింది.

మీరు e-కామర్స్ లోకి ప్రవేశించే కొవ్వొత్తి వ్యాపారం అయినా, సంగీత టీచర్ లేదా మీ ఇంట్లో చేసే స్వంత వంటలతో వ్యాపార విస్తరణ చేయాలనుకునే ఫుడ్ బ్లాగర్ అయినా, ఏదైనా కనీసం ఒక అర్హత కలిగిన ప్రోడక్ట్ ఉన్నట్లయితే చాలు ఆ వ్యాపారం లేదా క్రేయేటర్ అకౌంట్ నుండి ప్రజలను వారివైపు ఆకర్షించడానికి, షాపింగ్ ట్యాగ్‌లను ఉపయోగించి వారి వెబ్‌సైట్ కి మళ్లించవచ్చు, అని  Instagram పేర్కొంది.

అర్హత ఉన్న వ్యాపారులు భారతదేశంతో సహా Instagram Shopping కు మద్దతు ఉన్న అన్ని దేశాలలో జూలై 9 నుండి నేరుగా తమ ఉత్పత్తులను ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మడం ప్రారంభించవచ్చు. అర్హతగల వ్యాపారులు ఆర్గానిక్ పోస్ట్స్ లేదా స్టోరిల  ద్వారా విక్రయించదలిచిన ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు లేదా వాటిని Search  మరియు Explore టాబ్‌లో ఉంచవచ్చు. ట్యాగ్‌లు ఫోటో నుండి విక్రయించబడుతున్న ఉత్పత్తిని హైలైట్ చేస్తాయి మరియు దానిపై క్లిక్ చేరిన వెంటనే వినియోగదారులు కొనుగోలు చేయదలిచినప్రోడక్ట్ యొక్క ప్రధాన వెబ్‌సైట్‌కు మళ్ళించబడతారు.

ఈ Instagram Shopping ట్యాగ్ ను, ఇన్‌స్టాగ్రామ్ మొదటగా 2016 లో విడుదల చేసింది, ఆ తర్వాత 2018 లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షాపింగ్ ట్యాగ్‌లు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ 2019 లో సెలబ్రిటీలు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం షాపింగ్ ఫీచర్లను కూడా తెరిచింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo