ఆండ్రాయిడ్ ఫోన్లలో FAU-G గేమ్ ఎలా డౌన్లోడ్ చేయాలి?

ఆండ్రాయిడ్ ఫోన్లలో FAU-G గేమ్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
HIGHLIGHTS

FAU-G గేమ్ ఎట్టకేలకు విడుదల అవుతోంది

రిపబ్లిక్ డే రోజున ఈ గేమ్ లాంచ్ అవడానికి డేట్ ఫిక్స్

రేపు విడుదలకు సిద్దవుతున్న ఇండియన్ మొబైల్ గేమ్ యాప్ FAU-G

చాలా నెలలుగా టీజింగ్ తో ఊరిస్తూ వస్తున్న FAU-G గేమ్ ఎట్టకేలకు విడుదల అవుతోంది. అంటే, జనవరి 26 వ తేదీ రిపబ్లిక్ డే రోజున ఈ గేమ్ లాంచ్ అవడానికి డేట్ ఫిక్స్ చేశారు. వాస్తవానికి, ఈ గేమ్ కోసం Pre-Registration గత సంవత్సరం నవంబర్ నుండే మొదలయ్యాయి. అంతేకాదు, ఈ గేమ్ ప్రీ-రిజిస్ట్రేషన్ కి మంచి రెస్పాన్స్ కూడా లభించింది మరియు 40 లక్షలకు పైగా ప్రీ రిజిస్ట్రేషన్లను సాధించింది.

ఇక ఈ భారతీయ గేమ్ గురించి మాట్లాడితే, FAU-G లేదా ఫియర్ లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ అని పిలిచే ఈ గేమ్ ను భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'ఆత్మ నిర్భర్ భారత్' లో భాగంగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తీసుకొస్తున్నారు. దీనితో, వోకల్ ఫర్ లోకల్ నినాదానికి ఊపిరి పోస్తున్నారు.

FAU-G గేమ్ ఎలా డౌన్ లోడ్ చేయాలి?

ఇందుకోసం ప్రత్యేకమైన వివరాలేమీ అవసరం లేదు. గూగుల్ స్టోర్ నుండి FAU-G లేదా ఫియర్ లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ అని Search చేసి డౌన్ లోడ్ చేయాలి. ప్రీ రిజిస్ట్రేషన్ చేఉకున్న ఎవరికి మాత్రం నోటికేషన్ అందుతుంది మరియు ఇలా వెతకవల్సిన అవసరం ఉండదు.

 అయితే, ఈ గేమ్ పేరుతొ చాలా క్లోన్ యాప్స్ ఇప్పటికే ఉన్నందున డెవలపర్ యాప్ డౌన్ లోడ్ చేసుకొనేముందుగా ఒక్కసారి చూసుకోండి. కానీ, ఈ గేమ్ ఆండ్రాయిడ్ 8 కంటే పాత OS ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో మాత్రం పనిచేయదని గమనించాలి.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo