ఇక ప్రతి ఫోన్ లో Sanchar Saathi App కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు.!
Sanchar Saathi App అన్ని ఫోన్స్ లో కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరమైన కొత్త రూల్ ను మొబైల్ కంపెనీలకు ఆదేశించింది
సంచార్ సాథీ యాప్ అనేది భారత ప్రభుత్వం అందించిన సైబర్-సెక్యూరిటీ అండ్ టెలికాం సురక్షా యాప్
మొబైల్ ఫోన్ ను బేస్ చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మోసాలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. మన దేశంలో కూడా ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది. ఫోన్ చోరీ మరియు మొబైల్ ఫోన్ ద్వారా స్కామ్ చేయడం అనేది ఇప్పుడు సాధారణం అయ్యింది. అందుకే, ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరమైన కొత్త రూల్ ను మొబైల్ కంపెనీలకు ఆదేశించింది. ఒక ప్రతి ఫోన్ లో Sanchar Saathi App కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
SurveySanchar Saathi App కొత్త రూల్ ఏమిటి?
సంచార్ సాథీ యాప్ అనేది భారత ప్రభుత్వం అందించిన సైబర్-సెక్యూరిటీ అండ్ టెలికాం సురక్షా యాప్. ఇది పోర్టల్ మరియు యాప్ రెండు రూపాల్లో అందుబాటులో ఉంది. ముందు కేవలం వెబ్సైట్ నుంచి పోర్టల్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సైబర్ సర్వీస్ 2025 ప్రారంభంలో యాప్ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చింది.
సంచార్ సాథీ యాప్ ద్వారా అనేక సెక్యూరిటీ మరియు సేఫ్టీ సర్వీసులను కూడా ప్రజలకు ప్రభుత్వం అందించింది. ఇప్పుడు ఈ యాప్ ను అన్ని మొబైల్ ఫోన్ లలో ఉండేలా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ ప్రకారం, ముందుగా మొబైల్ కంపెనీలు ఇక నుంచి లాంచ్ అయ్యే అన్ని ఫోన్ లలో ఈ యాప్ ని డీఫాల్ట్ గా ముందే ఫోన్ లో ఇన్ స్టాల్ చేసి ఫోన్ లాంచ్ చేయాలి. అయితే, ఈ యాప్ డిలీట్ చేసే అవకాశం కూడా యూజర్ కు అందించాలని అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే, ఒకవేళ ఈ యాప్ యూజర్ వద్దనుకుంటే, ఎప్పుడైనా ఈ యాప్ డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, కొత్త సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ మరియు సాఫ్ట్ వేర్ అప్‌డేట్ ద్వారా ఈ యాప్ అన్ని ఫోన్ లో ఇన్ స్టాల్ చేయాలని కూడా ఆదేశించింది. కొత్త ఫోన్లలో ఈ యాప్ ముందే ఇన్ స్టాల్ చేయడానికి 90 రోజుల గ్రేస్ పీరియడ్ టైం ఇచ్చింది.

ఈ కొత్త చర్య ద్వారా దేశంలో ఉన్న అన్ని మొబైల్ ఫోన్ లలో కూడా సంచార్ సాథీ యాప్ డిఫాల్ట్ గా ఇన్ స్టాల్ చేయబడుతుంది. ఈ యాప్ Android మరియు iOS రెండింటికి అందుబాటులో ఉంది. ఈ యాప్ ని భారతదేశంలో జరిగే ఫేక్ సిమ్, డూప్లికేట్ సిమ్, IMEI స్పూఫింగ్ వంటి టెలికాం ఆధారిత మోసాలు గుర్తించడానికి తీసుకొచ్చారు. దీని ద్వారా ఫోన్ చోరీ అయినప్పుడు ట్రాక్ చేయడం మరియు గుర్తించడం చాలా సులభం అవుతుంది. ముఖ్యంగా, ఈ యాప్ తో చోరీ అయిన ఫోన్ IMEI నెంబర్ ను బ్లాక్ చేయడం ద్వారా ఈ ఫోన్ ను ఉపయోగించే అవకాశం లేకుండా చేయవచ్చు.
Also Read: boAt Dolby Audio సౌండ్ బార్ ని అమెజాన్ నుంచి రూ. 4,850 ధరలో అందుకోండి.!
ఇది మాత్రమే కాదు, ఇందులో యూజర్ పేరు మీద ఉన్న SIM కార్డు లను పూర్తిగా పరిశీలించడం మరియు ఫ్రాడ్ కాల్స్ ను గుర్తించి రిపోర్ట్ చేయడం మరియు ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ కోసం నేరుగా సహాయాన్ని అర్ధించడం వంటి పనులు ఈ యాప్ ద్వారా నిర్వహించవచ్చు. ఈ యాప్ ఫోన్ లో ఉండటం మొబైల్ యూజర్ కు మంచి సెక్యూరిటీ ఆసరా అవుతుంది. అందుకే, ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.