గూగుల్ మీట్ వీడియో కాలింగ్ అందరికీ ఉచితం

గూగుల్ మీట్ వీడియో కాలింగ్ అందరికీ ఉచితం
HIGHLIGHTS

Google Meet ఇక వినియోగదారులందరికీ ఉచితం అని గూగుల్ ప్రకటించింది

సంస్థ యొక్క వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ అయిన Google Meet ఇక వినియోగదారులందరికీ ఉచితం అని  గూగుల్ ప్రకటించింది. ఈ ప్లాట్‌ఫాం మే ఆరంభం నుండి అందరికీ అందుబాటులో ఉంటుంది.  వ్యాపార మరియు విద్య వంటి అనేకమైన అవసరాల కోసం వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఇమెయిల్ అడ్రెస్స్ లో రియల్ టైం క్యాప్షన్ మరియు లేఅవుట్ ఫీచర్లను ఉపయోగించగలరు.

Google Meet :

గూగుల్ మీట్ వచ్చే వారం నుండి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, దీని లభ్యత రాబోయే వారంలో అందరికి అందుతుందని  కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందని తెలిపింది.

గూగుల్ మీట్ ముఖ్యంగా జి సూట్‌లో భాగం అవుతుంది, ఇది వ్యాపారం, కంపెనీలు మరియు పాఠశాలలు మొదలైన వారికి సరైన పరిస్కారం కానుంది. అయినప్పటికీ, ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు meet.google.com లేదా iOS మరియు Android కోసం మొబైల్ యాప్ చేసుకోవడం ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. అయితే, ఉచిత ప్రోడక్ట్ మీటింగ్ పరిమితి 60 నిమిషాలు మాత్రమే ఉంటుందని, సెప్టెంబర్ 30 తర్వాత ఈ పరిమితి అమలు చేయబడదని కంపెనీ తెలిపింది.

గూగుల్ మీట్ యొక్క ఈ చర్య ప్రస్తుత పరిస్థితులకు సహాయకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. ఎందుకంటే, ప్రజలు ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ ను పెద్ద సంఖ్యలో ఉపయోగిస్తున్నారు.

గూగుల్ గత నెలలో హ్యాంగ్అవుట్స్ మీట్ నుండి  మీట్ పేరును మార్చింది. సంస్థ Hangout పేరును తెసివేయనుంది మరియు Hangouts యాప్ జూన్ నుండి నిలిపివేయబడతాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo