బార్స్ పేరుతో టిక్ టాక్ వంటి మ్యూజిక్ యాప్ తీసుకొచ్చిన ఫేస్‌బుక్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 28 Feb 2021
HIGHLIGHTS
  • టిక్ టాక్ మాదిరిగా పనిచేసే ఫేస్‌బుక్ కొత్త యాప్

  • స్టూడియో క్వాలిటీలో మ్యూజిక్ రీకార్డింగ్ చేసే సామర్ధ్యం

  • డ్రమ్ బీట్స్ మరియు Loops కు యాక్సెస్

బార్స్ పేరుతో టిక్ టాక్ వంటి మ్యూజిక్ యాప్ తీసుకొచ్చిన ఫేస్‌బుక్
బార్స్ పేరుతో టిక్ టాక్ వంటి మ్యూజిక్ యాప్ తీసుకొచ్చిన ఫేస్‌బుక్

ఒకప్పుడు అత్యంత ప్రాచుర్యం పొందిన షార్ట్ మ్యూజిక్ యాప్ టిక్ టాక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, సెక్యూరిటీ మరియు ప్రైవసీ అంశాల కారణంగా భారతదేశంలో టిక్ టాక్ బ్యాన్ చెయ్యబడింది. అందుకే, ఫేస్‌బుక్ NPE గ్రూప్ టిక్ టాక్ మాదిరిగా పనిచేసే యాప్ ను తీసుకొచ్చింది. 'Bars' పేరుతొ తీసుకొచ్చిన ఈ షార్ట్ మ్యూజిక్ యాప్ స్టూడియో క్వాలిటీలో మ్యూజిక్ రీకార్డింగ్ చేసే సామర్ధ్యంతో వస్తుంది.

ఇక ఈ కొత్త ఫేస్‌బుక్ షార్ట్ మ్యూజిక్ యాప్ మరిన్ని వివరాలను పరిశీలిస్తే, ఇందులో డ్రమ్ బీట్స్ మరియు Loops కు యాక్సెస్  ఉంటుంది, వీటితో రైమింగ్ సూపర్ గా వుంటుంది. ఇంకా అర్ధం కాలేదా?  ర్యాప్ సంగీతాన్ని వినే యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్ తెస్తోంది ఫేస్‌బుక్. వాస్తవానికి, టిక్ టాక్ బ్యాన్ అయినప్పటి నుండి టిక్ టాక్ లాంటి మ్యూజిక్ యాప్స్ చాలానే వచ్చాయి.

ఫేస్‌బుక్ బార్స్, కొల్లాబ్ యాప్ లో పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు. మహమ్మారి ఆధునిక సమాజాన్ని పూర్తిగా మార్చివేసిందున  ఫేస్‌బుక్ ఎంటర్టైన్మెంట్ అంశం పైన పెట్టుబడి పెట్టాలని చూస్తోంది.  

logo
Raja Pullagura

email

Web Title: facebok introduces tik tok like app called bars
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status