Gold Price: 75 వేలకు చేరుకున్న బంగారం ధర.. ఈరోజు ఎంత పెరిగిందంటే.!

Gold Price: 75 వేలకు చేరుకున్న బంగారం ధర.. ఈరోజు ఎంత పెరిగిందంటే.!
HIGHLIGHTS

ఈరోజు కూడా గోల్డ్ రేట్ భారీగా పెరిగింది

Gold Price ఈరోజు కూడా తులానికి రూ. 980 రూపాయల భారీ పెరుగుదలను చూసింది

రెండు రోజుల్లోనే రూ. 1,500 రూపాయల భారీ పెరుగుదలను చూసింది గోల్డ్ మార్కెట్

Gold Price: నిపుణులు చెబుతున్న మాటని నిజం చేస్తూ, ఈరోజు కూడా గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. నిన్న మార్కెట్ లో తులానికి రూ. 600 రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్, ఈరోజు కూడా తుతులానికి రూ. 900 రూపాయల భారీ పెరుగుదలను చూసింది. అంటే, ఈ వారంలో గడిచిన రెండు రోజుల్లోనే రూ. 1,500 రూపాయల భారీ పెరుగుదలను చూసింది గోల్డ్ మార్కెట్. ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న గోల్డ్ రేట్ మరియు గోల్డ్ మర్కెట్ అప్డేట్ వివరాల పైన ఒక లుక్కేద్దాం పదండి.

Gold Price:

గోల్డ్ మార్కెట్ 80 వేల రూపాయల వరకూ పెరగ వచ్చని నిపుణులు చెప్పిన అంచనాలను నిజం చేసేలా, ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. ఈ నెల ప్రారంభం నుండి పెరిగిన గోల్డ్ రేట్ ను చూస్తే, నిపుణులు చెప్పిన మాటలు త్వరలోనే నిజం కావచ్చని అనిపిస్తోంది.

Gold Price reached 75k today 16 April 2024
#image_title

ఏప్రిల్ 1వ తేది నాటికి 70 వేల రూపాయల కంటే దిగువన గోల్డ్ మార్కెట్ కొనసాగింది. అయితే, ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, 75 వేల రూపాయల పైనే కొనసాగుతోంది. అంటే, 16 రోజుల్లో గోల్డ్ రేట్ 5 వేల రూపాయల పైనే పెరిగింది.

ఇక గత మూడు నెలల గోల్డ్ సూచీల గ్రాఫ్ ను పరిశీలిస్తే, సూచీలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. జనవరి 16న రూ. 63 వేల రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేట్, ఏప్రిల్ 16 నాటికి 75 వేల ను చూసింది. అంటే, తులానికి 12 వేల రూపాయల దారుణమైన పెరుగుదలను గోల్డ్ మార్కెట్ చూసింది.

Also Read: రేపు విడుదల కానున్న Vivo T3X 5G Price మరియు Top 5 ఫీచర్స్ రివీల్ చేసిన వివో.!

24 క్యారెట్ గోల్డ్ రేట్

ఈరోజు మార్కెట్ లో నడుస్తున్న 24 క్యారెట్ బంగారం ధర వివరాల్లోకి వెళితే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 74,130 రూపాయల వద్ద నిలిచింది. ఈరోజు ఒక తులం 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 980 రూపాయలు పెరిగింది.

22 క్యారెట్ గోల్డ్ రేట్

ఇక ఈరోజు నడుస్తున్న 22 క్యారెట్ గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 67,150 రూపాయల వద్దకు చేరుకుంది. ఈరోజు ఒక తులం 22 క్యారెట్ బంగారం ధర రూ. 900 రూపాయలు పైకి చేరుకుంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo