ఒకప్పుడు Cyber Cafe ఇప్పుడు Smartphone: తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ లైఫ్ ఎలా మారింది.!

HIGHLIGHTS

స్మార్ట్ ఫోన్ వచ్చాక అరచేతిలో ప్రపంచం కదలాడుతోంది

ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే సైబర్ కేఫ్‌ కి వెళ్లడమే మార్గం

తెలుగు రాష్ట్రాలలో వచ్చిన డిజిటల్ లైఫ్ మార్పులు నేడు ఒకసారి గుర్తు చేసుకుందాం

ఒకప్పుడు Cyber Cafe ఇప్పుడు Smartphone: ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్ వచ్చాక అరచేతిలో ప్రపంచం కదలాడుతోంది, కానీ ఒకప్పుడు అలా కాదు. ఇంటర్నెట్ అంటే సైబర్ కేఫ్‌ కి వెళ్లడం మరియు ఉన్న ఒకటో రెండో కంప్యూటర్స్ కోసం లైన్ లో పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఒక మెయిల్ లేదా ఫోటో పంపాలంటే కూడా కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవాలి. అయితే, ఇప్పుడు ఫోటో ఏమిటి ఏకంగా 4K లో కూడా రియల్ టైం వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, ఆన్లైన్ లో UPI చెల్లింపు, ఆన్‌లైన్ క్లాస్, ప్రభుత్వ సేవ, ఇలా ఒకటేమిటి అన్నీ పనులు అరచేతిలో ఉండే స్మార్ట్‌ ఫోన్‌ లో నిర్వహించవచ్చు. ఇదంతా రాత్రికి రాత్రే జరిగాలేదు. ఇదంతా జరగడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ లైఫ్ సాగిన ఈ ప్రయాణం కేవలం టెక్నాలజీలో వచ్చిన మార్పు మాత్రమే కాదు, ఇది మన జీవనశైలినే పూర్తిగా మార్చిన ఒక సామాజిక పరివర్తన. ఈ సుదీర్ఘ ప్రయాణం మరియు ఇందులో తెలుగు రాష్ట్రాల

ఒకప్పుడు Cyber Cafe ఇప్పుడు Smartphone:

ఒకప్పుడు నెట్ లేదా ఇంటర్నెట్ ఉందా అని అడిగే రోజులు ఇప్పుడు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కి రోజులు మారాయి. ఇది నిజంగా ఈ మిలీనియం లో మానవజాతి సాధించిన ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది.

ఎందుకంటే, 2000 సంవత్సరం ప్రారంభంలో ఇంటర్నెట్ అనే మాట వినగానే చాలా మందికి గుర్తొచ్చేది సైబర్ కేఫ్ లేదా ఇంటర్నెట్ సెంటర్ మాత్రమే. పట్టణాల్లో ప్రధాన రహదారుల వెంట, కాలేజీల దగ్గర, బస్‌ స్టాండ్ పరిసరాల్లో చిన్న చిన్న సైబర్ కేఫ్‌ లు కనిపించేవి. ఈ షాపు లేదా ఇంటర్నెట్ సెంటర్ బయట “Internet Browsing Available” అనే బోర్డు ఒక పెద్ద హోదాగా అనిపించేది. లోపల వరుసగా కంప్యూటర్లు ఉండటం మరియు వాటిని ఉపయోగించుకోవడానికి ఒక గంట ఇంటర్నెట్ కోసం డబ్బులు చెల్లించే వారు. ఇది మిలీనియల్స్ కి బాగా సుపరిచితమైన డిజిటల్ లైఫ్.

ఆ కాలంలో ఈ-మెయిల్ పంపాలన్నా, ఉద్యోగానికి అప్లై చేయాలన్నా, రైల్వే టికెట్ బుక్ చేయాలన్నా లేదా విదేశాల్లో ఉన్న బంధువులతో చాట్ చేయాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సైబర్ కేఫ్‌నే ఆశ్రయించాల్సి వచ్చేది. ఆ కాలంలో ఇంటర్నెట్ సర్వీస్ తో కూడిన కంప్యూటర్ అతి కొద్ది మంది వద్ద మాత్రమే ఉండేది. ఒకవేళ ఇంట్లో కంప్యూటర్ ఉన్నా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం ఆ రోజుల్లో పెద్ద విషయమే అవుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే, అప్పుడు ఇంటర్నెట్ మన ప్రజల జీవితంలో ఒక ప్రత్యేక స్థలంగా ఉండేది.

మారిన కాలంతో జేబులోకి వచ్చిన ప్రపంచం

స్మార్ట్‌ ఫోన్ విప్లవం ఈ కథను పూర్తిగా మార్చేసింది. మొదట మొబైల్ ఫోన్ అంటే కాల్స్ మరియు SMS కి మత్రమే అవకాశం ఉండేది. తర్వాత కాలంలో ఈ మొబైల్ తో కెమెరా జత కలిసింది. కొన్నాళ్లకు 3G, 4G, చౌకైన డేటా, ఇప్పుడు అన్లిమిటెడ్ 5G డేటాతో చివరకు స్మార్ట్‌ ఫోన్ ఒక చిన్న కంప్యూటర్‌ గా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఒకరితో మరొకరు రియల్ టైం లో చూడటం మరియు మాట్లాడటం కూడా చేయవచ్చు.

ముఖ్యంగా ఇవన్నీ చేయడానికి ప్రత్యేకంగా కంప్యూటర్ గదికి వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ చేతులో ఉండే స్మార్ట్ ఫోన్ సరిపోతుంది.

తెలుగు భాషకు కొత్త డిజిటల్ ఊపిరి

డిజిటల్ విప్లవం కేవలం ఇంగ్లిష్‌ కి మాత్రమే పరిమితం కాలేదు. తెలుగు కూడా స్మార్ట్‌ ఫోన్ ప్రపంచంలో తన స్థానం సంపాదించుకుంది మరియు పదిలపరిచింది. డిజిటల్ యుగంలో తెలుగులో టైప్ చేయడం మరింత సులభమైంది. అంతేకాదు, కీస్ లేకుండా జస్ట్ మాట్లాడితే టైప్ చేసే వాయిస్ టైపింగ్ వచ్చింది. తెలుగు వార్తలు, YouTube ఛానళ్లు, పాడ్‌ కాస్ట్‌లు, షార్ట్ వీడియోలు మరియు సోషల్ మీడియా పోస్టులు భారీగా పెరిగాయి.

ఒకప్పుడు కంప్యూటర్‌ లో తెలుగు టైప్ చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌ వేర్ లేదా ఫాంట్ అవసరమయ్యేవి. కానీ, ఇప్పుడు కేవలం ఫోన్‌ లో మాట్లాడితే చాలు తెలుగు అక్షరాలుగా మారిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే, టెక్నాలజీ భాషను మార్చలేదు, దానికి బదులుగా భాషకు టెక్నాలజీలో కొత్త వేదికను అందించింది.

తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కంటెంట్ క్రియేటర్లు, చిన్న వ్యాపారులు, కళాకారులు, ఉపాధ్యాయులు తమ మాటను ప్రపంచానికి వినిపించగలగడానికి స్మార్ట్‌ ఫోన్ ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. ఇది మాత్రమే కాదు, ఆన్‌లైన్ క్లాసులు, డిజిటల్ నోట్స్, వీడియో లెక్చర్లు, ఆన్‌లైన్ పరీక్షలు వంటివి తెలుగు రాష్ట్రాల విద్యార్థి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి.

UPI చెల్లింపులు

తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ జీవితాన్ని అత్యంత స్పష్టంగా చూపించే మార్పుల్లో డిజిటల్ చెల్లింపులు ఒకటి. ఇది డబ్బులు చేతులు మారకుండానే చెల్లించే అద్భుతమైన చెల్లింపుగా అందరి మన్ననలు అందుకుంది. కూరగాయల బండి నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు, టిఫిన్ సెంటర్ నుంచి క్యాబ్ వరకు, “QR ఉందా?” అనే ప్రశ్న సాధారణ ప్రశ్నగా మారింది.

గ్రామాలు కాదు – డిజిటల్ గ్రామాలు

తెలుగు రాస్తాలో డిజిటల్ మార్పు అనేది కేవలం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాలేదు. స్మార్ట్ ఫోన్ రాకతో గ్రామాలు కూడా డిజిటల్ గ్రామాలు గా మారిపోయాయి.

స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ తో రైతులకు రియల్ టైం వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, వ్యవసాయ సలహాలు తెలుసుకోవడం చాలా సులభం అయ్యింది. అంతేకాదు, చిన్న వ్యాపారులు సైతం WhatsApp ద్వారా కస్టమర్లతో మాట్లాడుతున్నారు. విద్యార్థులు YouTube ద్వారా ప్రపచ నలుమూలలో ఉన్న విద్యావేత్తల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారు.

అంటే ఒకప్పుడు నగరంలోని సైబర్ కేఫ్ కి వెళితే మాత్రమే లభించిన సమాచారం, ఇప్పుడు గ్రామంలోని ఇంటి ముంగిటికి, రైతు పొలానికి మరియు ఇంట్లో ఉన్న విద్యార్థుల చేతిలోకి కూడా అంది వచ్చింది.

నాణానికి బొమ్మ బొరుసు ఉంటాయి

డిజిటల్ జీవితం మనకు ఎంత సౌకర్యం తెచ్చిందో, అంతే బాధ్యతను కూడా తీసుకొచ్చింది. అతి ఎక్కువ స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా అలవాటు, ఫేక్ న్యూస్, ఆన్‌లైన్ మోసాలు మరియు వ్యక్తిగత సమాచార భద్రత వంటి సమస్యలు ఇప్పుడు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు ఒకప్పుడు సైబర్ కేఫ్‌ లో మనం ఒక గంట ఇంటర్నెట్ ఉపయోగించడం వ్యయప్రయాసలతో కూడిన విషయంగా ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తో ఇంటర్నెట్ మన చేతిలో 24 గంటలు ఉంటుంది.

అందుకే డిజిటల్ సాక్షరత అంటే కేవలం యాప్ ని ఎలా ఉపయోగించాలి అని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఏ సమాచారాన్ని నమ్మాలి, ఏ లింక్‌ ను క్లిక్ చేయకూడదు, OTP ఎవరితో ఎందుకు పంచుకోకూడదు, వ్యక్తిగత ఫోటోలు, పాస్‌ వర్డ్‌లు ఎలా రక్షించుకోవాలి వంటి అన్ని సూక్ష్మమైన విషయాలు తెలుసుకోవడం కూడా డిజిటల్ జీవితంలో భాగమే అని గుర్తుంచుకోండి.

Also Read: రూ. 4,000 బడ్జెట్ లో 5.1 Soundbar కావాలా .. జస్ట్ లుక్ హియర్.!

మూడు తరాలు .. మూడు డిజిటల్ ప్రపంచాలు

తెలుగు రాష్ట్రాల్లో ఒకే కుటుంబంలో మూడు రకాల డిజిటల్ అనుభవాలు కనిపిస్తాయి. ఇది మన అనుభవంలో ఉన్న ముఖ్యమైన విషయం. తాతయ్య అమ్మమ్మ తరంలో “ఫోన్‌లో మాట్లాడితే చాలు.” అని అనుకుంటే, తల్లిదండ్రుల తరంలో “బ్యాంకింగ్, బిల్లులు, టికెట్లు అన్నీ ఫోన్‌ లోనే.” జరిగిపోయాయి. ఇక పిల్లల తరం వచ్చేసరికి “చదువు, వినోదం, ఫ్రెండ్ , గేమ్స్, కెరీర్” అన్నీ ఫోన్‌ లోనే సాగిపోతున్నాయి.

అయితే, ఇక్కడ మనం గమనించవలసిన రెండు విషయాలు ఉన్నాయి. అవేమిటంటే, ‘సైబర్ కేఫ్ మాకు ఓర్పు నేర్పితే స్మార్ట్ ఫోన్ మాత్రం మనకు వేగం నేర్పింది’. కానీ గత రెండు దశాబ్దాల తెలుగు డిజిటల్ చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

“ ఒకప్పుడు మనం ఇంటర్నెట్‌ కి వెళ్లేవాళ్లం – ఇప్పుడు ఇంటర్నెట్ మన జీవితంలోనే ఉంది”

అదే సైబర్ కేఫ్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు వచ్చిన తెలుగు రాష్ట్రాల డిజిటల్ ప్రయాణం. ఇది అందరికీ ఎన్నో జ్ఞాపకాలు మాత్రం మిగిల్చింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :