boltt ACE 5G రేపు లాంచ్ అవుతుంది .. ఈ ఫోన్ పూర్తి ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!

HIGHLIGHTS

boltt ACE 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది

బోల్ట్ ఏస్ 5జి మరియు బోల్ట్ ఈవో 4జి రెండు స్మార్ట్ ఫోన్ లు లాంచ్ చేస్తుంది

ఈ బోల్ట్ కొత్త ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది

boltt ACE 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ప్రముఖ భారతీయ కన్స్యూమర్ టెక్ అండ్ వేరబుల్ బ్రాండ్, ఫైర్ బోల్ట్ స్మార్ట్ ఫోన్ రంగంలో అడుగుపెట్టడానికి ఈ కొత్త boltt ఉప బ్రాండ్ ని నిర్మించింది. ఈ కొత్త కంపెనీ ద్వారా ఇప్పడూ తన మొదటి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడానికి సిద్దమయ్యింది. ఇందులో బోల్ట్ ఏస్ 5జి మరియు బోల్ట్ ఈవో 4జి రెండు స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. ఈ ఫోన్ లాంచ్ కంటే ఒక రోజు ముందుగానే ఈ ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

boltt ACE 5G లాంచ్ సమయం ఏమిటి?

బోల్ట్ ఏస్ మరియు బోల్ట్ ఈవో రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతాయి. ఈ రెండు ఫోన్లు కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా లాంచ్ అవుతున్నాయి మరియు లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి కూడా వస్తాయి.

boltt ACE 5G: ఫీచర్స్

బోల్ట్ ఏస్ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ 9.49mm తో కొంచెం మందంగా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీ కారణంగా ఈ ఫోన్ ఇంత మందంతో ఉంటుంది. ఇందులో 6.79 ఇంచ్ LCD స్క్రీన్ HD+ రిజల్యూషన్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు సన్నని అంచులు కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 5 లక్షల 47 వేల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే ప్రాసెసర్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది కాకుండా మెమరీ కార్డు తో 1TB వరకు స్టోరేజ్ ను విస్తరించే అవకాశం కూడా ఈ ఫోన్ లో అందించింది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 64MP మెయిన్ కెమెరా జతగా మరో రెండు కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది రియల్ టోన్ తో పిక్చర్స్ అందించడమే కాకుండా లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో బిల్ట్ ఇన్ జెమినీ ఏఐ ఫీచర్ ని కూడా బోల్ట్ ప్రొవైడ్ చేసింది.

Also Read: Aadhaar Update: మీకు 15 సంవత్సరాల వయసు లోపు పిల్లలు ఉంటే ఈ కీలక అప్‌డేట్ మీకోసమే.!

రేపు లాంచ్ కాబోతున్న ఈ బోల్ట్ కొత్త ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 18w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా బోల్ట్ అందించింది. ఈ ఫోన్ ను ఆరు అందమైన సరికొత్త కలర్స్ లో లాంచ్ చేస్తున్నట్లు బోల్ట్ ప్రకటించింది.

రేపు మధ్యాహ్నం ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ తో మళ్ళి కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :