lava launches VIRAT V1 Pro 5G with big offers
VIRAT V1 Pro 5G స్మార్ట్ ఫోన్ ను లావా ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన విరాట్ వి1 5జి ఫోన్ యొక్క Pro వేరియంట్ గా ఈ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ ను గత ఫోన్ కంటే అధిక శక్తి కలిగిన ప్రాసెసర్, కెమెరా మరియు బ్యాటరీ వంటి ఫీచర్స్ తో లాంచ్ చేసింది. మరి లావా సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
లావా ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 6GB + 128GB వేరియంట్ తో అందించింది. ఈ ఫోన్ ను కేవలం రూ. 15,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సిక్కిం మిడ్ నైట్ మరియు స్పిటి ఫ్రాస్ట్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు లావా అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని లావా అందించింది. SBI బ్యాంక్ మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: బడ్జెట్ ధరలో 65 ఇంచ్ Smart Tv డీల్ కోసం సెర్చ్ చేస్తుంటే .. ఒక లుక్కేయండి.!
లావా విరాట్ వి1 ప్రో స్మార్ట్ ఫోన్ ను మంచి స్లీక్ డిజైన్ లో లాంచ్ చేసింది. ఇందులో 6.74 ఇంచ్ LCD స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. లావా ఈ ఫోన్ ను Unisoc T8200 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో లాంచ్ చేసింది. అలాగే, ఇందులో 6GB ఫిజికల్ ర్యామ్, 6GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది క్లీన్ ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది.
ఈ లావా స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు సెల్ఫీలు అండ్ వీడియో కాలింగ్ కోసం ముందు సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో లావా కెమెరా ఫీచర్స్ తో పాటు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ లో 6000 mAh భారీ బ్యాటరీని అందించింది మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.