Aadhaar Update: మీకు 15 సంవత్సరాల వయసు లోపు పిల్లలు ఉంటే ఈ కీలక అప్‌డేట్ మీకోసమే.!

HIGHLIGHTS

మీకు 15 సంవత్సరాల వయసు లోపు పిల్లలు ఉంటే ఈ కీలక అప్‌డేట్ మీకోసమే

పిల్లల ఆధార్ అప్‌డేట్ ను ఉచితంగా చేసుకోవచ్చు

పిల్లల ఆధార్ ఉచిత అప్‌డేట్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది

Aadhaar Update: మీకు 15 సంవత్సరాల వయసు లోపు పిల్లలు ఉంటే ఈ కీలక అప్‌డేట్ మీకోసమే. పిల్లల ఆధార్ ఉచిత అప్‌డేట్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి, ఈ నెల రోజులు డెడ్ లైన్ గడువు లోపు 15 సంవత్సరాల వయసు లోపు పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, వారి పిల్లల ఆధార్ అప్‌డేట్ ను ఉచితంగా చేసుకోవచ్చు. ఈ డెడ్ లైన్ గడిస్తే ఆధార్ అప్‌డేట్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో అన్ని అవసరాలకు ముఖ్యమైన పత్రంగా ఆధార్ కార్డు చెల్లుబాటు అవుతోంది. అందుకే, పిల్లల ఆధార్ ను వయసును బట్టి కొత్త వివరాలతో విధిగా అప్‌డేట్ చేయడం మంచిది.

Aadhaar Update: ఉచిత అప్‌డేట్ డెడ్ లైన్ ఏమిటి?

5 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ ను అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది. అలా కాకుండా తల్లిదండ్రుల బయోమెట్రిక్ తో నడిపిస్తే, వారి ఆధార్ కార్డు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ ను నిర్ణీత సమయానికి చేయడం తప్పనిసరి చేసింది కేంద్రం. అంతేకాదు, ఇలా చేయడానికి వీలుగా పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ఉచిత ఆధార్ అప్‌డేట్ సౌలబ్యాన్ని కూడా అందించింది.

అయితే, ఈ ఉచిత ఆధార్ అప్‌డేట్ సౌలభ్యం సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే, మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ ఉచిత అప్‌డేట్ కోసం ఇంకా నెల రోజులు మాత్రమే అవకాశం ఉంది.

Aadhaar Update: ఎలా మరియు ఎక్కడ చేయాలి?

మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్స్ ని సందర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీ పిల్లల ఆధార్ వివరాలలో ఏమైనా పొరపాటు ఉంటే కూడా బయోమెట్రిక్ అప్‌డేట్ పాటు సరిచేసుకోవచ్చు. దీనికోసం మీ పిల్లల ఆధార్ కార్డు, ఇంటి పెద్ద ఆధార్ కార్డు అండ్ అడ్రస్ ప్రూఫ్ తో పాటు జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate) తీసుకుని ఆధార్ సెంటర్ కి వెళ్ళాలి.

ఇక్కడ ఆధార్ సెంటర్ ప్రతినిధులు మీ పిల్లల లేటెస్ట్ లైవ్ ఫోటో, బయోమెట్రిక్ మరియు అవసరమైన ఇతర వివరాలు సైతం అప్‌డేట్ చేసి కొత్త కార్డు కోసం అక్నాలెడ్జ్మెంట్ కాగితం అందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన 15 రోజుల లోపు ఈ కొత్త వివరాలు ఆన్లైన్ లో అప్‌డేట్ చేయబడతాయి.

అయితే, ఫిజికల్ ఆధార్ కార్డు ఇంటికి చేరడానికి 90 రోజుల టైం పీరియడ్ ఉంటుంది. అంటే, మీ పిల్లల ‘ఆధార్ అప్‌డేట్ చేసిన 90 రోజుల లోపు మీ పిల్లల కొత్త ఆధార్ కార్డు మీ ఇంటికి చేరే అవకాశం ఉంటుంది.

Also Read: VIRAT V1 Pro 5G స్మార్ట్ ఫోన్ ను భారీ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన Lava

ఈ అప్‌డేట్ చేయకుంటే ఏదైనా నష్టం జరుగుతుందా?

ఈ అప్‌డేట్ చేయకుంటే ఏదైనా నష్టం జరుగుతుందా? అని అడిగితే, జరుగుతుందనే చెబుతారు. ఎందుకంటే, 5 నుంచి 7 సంవత్సరాల వయసు లోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయకుంటే వారి ఆధార్ డీ యాక్టివేషన్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే, పిల్లలకు 15 సంవత్సరాల వయసు రాగానే మళ్ళీ బయోమెట్రిక్ చేయించాల్సి ఉంటుంది. ఇలా చేయకుంటే 10వ తరగతి మరియు ఆపై చదువుల సమయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండొచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :