దూసుకెళుతున్న గోల్డ్ సూచీలు..ఈరోజు ఎంత పెరిగిందంటే.!
దేశంలో బంగారం ధరకు అమాంతం రెక్కలొచ్చాయి
గత నెలలో మొదలైన గోల్డ్ సూచీల పెరుగుదల
ఒక్క వారం లోనే 900 రూపాయలకు పైగా తులానికి బంగారం ధర పెరిగి పోయింది
దేశంలో బంగారం ధరకు అమాంతం రెక్కలొచ్చాయి. గత నెలలో మొదలైన గోల్డ్ సూచీల పెరుగుదల, ఇప్పటి వరకూ ఆగకుండా సాగుతూనే వుంది. ఇప్పటికే బంగారం ధర కేవలం ఈ వారంలోనే తులం బంగారం ధర 700 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చెయ్యగా, ఈరోజు కూడా 200 రూపాయలకు పైగా పెరిగింది. అంటే, ఈ కేవలం ఈ ఒక్క వారం లోనే 900 రూపాయలకు పైగా తులానికి బంగారం ధర పెరిగి పోయింది. ఈ రోజు గోల్డ్ మార్కెట్ ఎలా కొనసాగుతోందో చూద్దామా.
Gold Rate:
నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,100 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 200 రూపాయలు పెరిగి, రూ.51,300 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.55,750 రూపాయల నుండి రూ.55,960 రూపాయల వద్దకు చేరుకుంది.
ఈరోజు బంగారం ధర
ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,960 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,960 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,111 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే కోయంబత్తూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు కోయంబత్తూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,280 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,030 గా ఉంది.
సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి.