200MP భారీ కెమెరాతో వస్తున్న మోటరోలా స్మార్ట్ ఫోన్..!!
మోటరోలా తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 200MP భారీ కెమెరాతో తీసుకురాబోతోంది. ఈ విషయం గురించి మోటోరోలా స్వయంగా వెల్లడించింది. చైనీస్ సోషల్ సైట్ Weiboలో బ్రాండ్ నుండి రాబోయే 200MP ఫోన్ గురించి టీజ్ చేసే పోస్టర్‌ను మోటరోలా షేర్ చేసింది. ఈ టీజర్ లో నేరుగా చెప్పకుండా 200MP గురించి అర్థమొచ్చేలా సూచించింది. ఈ టీజర్ లో "200-మిలియన్ పిక్సెల్ చిత్రాల యుగానికి" స్వాగతం అని వెల్లడించింది. వాస్తవానికి, 200ఎంపి కెమెరా ఫోన్ గురించి మనం వినడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే చాలా సార్లు మోటరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఈ అతిపెద్ద కెమేరాతో రాబోతున్నట్లు మనం విన్నాం. దీనికి “Frontier” అనే పేరును సూచిండం మనం నెట్టింట్లో చూశాం.
మునుపటి లీక్ ఫ్రాంటియర్ స్మార్ట్‌ఫోన్ గురించి చాలా తక్కువగా సమాచారాన్ని వెల్లడించగా, లేటెస్ట్ నమూనా చిత్రాలు ఈ ఫోన్ మొత్తం డిజైన్ ను వెలుగులోకి తెచ్చాయి.
Motorola Frontier: అంచనా స్పెక్స్
గతంలో లీకైన మోటోరోలా ఫ్రాంటియర్ లీక్డ్ రెండర్ల ప్రకారం, ఈ ఫోన్ 6.7-అంగుళాల HDR10+ FHD+ 144Hz AMOLED డిస్ప్లేను కలిగి ఉండవచ్చని మేము భావిస్తున్నాము. ముందు భాగంలో 60MP సెల్ఫీ కెమెరా కూడా ఉండవచ్చు.
కెమెరాల పరంగా ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 200MP మైన్ సెన్సార్ మరియు రెండు అదనపు లెన్స్‌లను కలిగి ఉంటుంది. ఇందులో, ఒకటి 50MP Samsung అల్ట్రావైడ్ లెన్స్ కాగా మరొకటి 12-MP సోనీ IMX663 టెలిఫోటో లెన్స్. అంతేకాదు, మోటోరోలా ఫ్రాంటియర్ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 Gen 1 Plus SoC యొక్క శక్తితో పనిచేస్తుందని కూడా లీకైన నివేదికలు చెబుతున్నాయి.
అంతేకాదు, 12GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజీ వరకు ఉంటుంది. ఈ ఫోన్ లో అందించే బ్యాటరీ పరిమాణం 4500mAh మరియు ఛార్జింగ్ వేగం అద్భుతమైన 125 వాట్స్ కావచ్చు. అయితే, ఇవన్నీ కూడా దాదాపుగా ఉచించి చెబుతున్నవే కాబట్టి ఫోన్ విడుదల సమయంలో ఖచ్చితమైన వివరాలను చూడవచ్చు.