Sony WF-C510: తక్కువ ధరలో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన సోనీ.!

HIGHLIGHTS

సోనీ ఇండియా ఈరోజు మార్కెట్లో కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది

Sony WF-C510 ఇయర్ బడ్స్ ను పవర్ ఫుల్ ఫీచర్స్ తో తక్కువ ధరలో లాంచ్ చేసింది

ఈ బడ్స్ ను నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ లతో కూడా అందించింది

Sony WF-C510: తక్కువ ధరలో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన సోనీ.!

Sony WF-C510: సోనీ ఇండియా ఈరోజు ఇండియా మార్కెట్లో కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ను పవర్ ఫుల్ ఫీచర్స్ తో తక్కువ ధరలో లాంచ్ చేసింది. అదే సోనీ WF-C510 TWS బడ్స్ మరియు ఈ బడ్స్ ను నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ లతో కూడా అందించింది. ఈ లేటెస్ట్ సోనీ ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్స్ తో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony WF-C510: ఫీచర్స్

సోనీ ఈ కొత్త బడ్స్ ను సోనీ యొక్క కాంపాక్ట్ మరియు క్లోజ్డ్ టైప్ ఇయర్ బడ్స్ సిరీస్ అయిన WF సిరీస్ నుంచి ఈ కొత్త బడ్స్ ను అందించింది. ఈ కొత్త బడ్స్ ను కూడా చాలా కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ సౌండ్ అందించే ఫీచర్ తో అందించింది. ఈ సోనీ కొత్త బడ్స్ రౌండ్ డిజైన్ మరియు మాట్టే ఫినిష్ తో ఆకట్టుకుంటాయి.

గొప్ప క్వాలిటీ సౌండ్ కోసం ఈ బడ్స్ లో DSEE (డిజిటల్ సౌండ్ ఎన్ హెన్స్ మెంట్ ఇంజిన్) అందించింది. ఇది హై క్వాలిటీ సౌండ్ ను మంచి బ్యాలెన్స్ తో అందిస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ లో స్పెటియల్ సౌండ్ అనుభూతి కోసం 360 Reality Audio సపోర్ట్ ను అందించింది. ఇది క్లోజ్డ్ టైప్ బడ్స్ అయినా ఇందులో అందించిన యాంబియంట్ మోడ్ తో చుట్టూ ఉండే సౌండ్ లు వినబడే అవకాశం అందిస్తుంది.

Sony WF-C510 features

ఈ సోనీ బడ్స్ లో ప్రత్యేకమైన Voice Focus వుంది. ఈ ఫీచర్ ను ఆన్ చేయగానే మంచి కాలింగ్ అనుభూతిని అవతలి వారికి అందిస్తుంది. ఈ బడ్స్ టోటల్ 22 గంటల ప్లే టైం అందిస్తుంది. సింగల్ రీచార్జ్ తో ఈ బడ్స్ 11 గంటల ప్లే టైం అందిస్తాయని సోనీ తెలిపింది. ఈ బడ్స్ లో క్విక్ ఛార్జ్ సపోర్ట్ వుంది మరియు 5 నిమిషాల ఛార్జ్ తో 60 మినిట్స్ ప్లే టైం ని ఈ బడ్స్ అందిస్తాయి.

సోనీ WF-C510 ఇయర్ బడ్స్ రెండు డివైజ్ లను ఒకేసారి కనెక్ట్ చేసేలా మల్టీ కనెక్షన్ ఫీచర్ ను కూడా కలిగి వుంది. ఈ బడ్స్ సలాండ్ ను కస్టమైజ్ చేయడానికి Sony Headphones Connect app సపోర్ట్ తో వస్తుంది.

Also Read: G0VO GoSurround 320: ఇన్ బిల్ట్ బ్యాటరీ మరియు 3D Sound తో కొత్త సౌండ్ బార్ లాంచ్.!

Sony WF-C510: ప్రైస్

సోనీ ఈ కొత్త ఇయర్ బడ్స్ ను రూ. 4,990 ధరతో విడుదల చేసింది. ఈ బడ్స్ బ్లూ, ఎల్లో, బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్ లలో లభిస్తాయి. ఈ బడ్స్ పై రూ. 1,000 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ బడ్స్ ను రూ. 3,990 ధరకే పొందవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అక్టోబర్ 31 వ తేదీ వరకు మాత్రమే లభిస్తుంది. ఈ సోనీ బడ్స్ సెప్టెంబర్ 26వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ ఆన్లైన్, ShopatSC.com మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ లో కూడా లభిస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo