Amazon GIF Sale: రూ. 37,999 కే iPhone 13 అందుకోండి అంటున్న అమెజాన్.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఊరిస్తున్న ‘King Of All Deals’ ఆఫర్

2024 అతిపెద్ద పండుగ సీజన్ కోసం తీసుకు వస్తున్న అప్ కమింగ్ సేల్

ఈ ఫోన్ ను ఇంత తక్కువ ధరకు ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి

Amazon GIF Sale: రూ. 37,999 కే iPhone 13 అందుకోండి అంటున్న అమెజాన్.!

Amazon GIF Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఊరిస్తున్న ‘King Of All Deals’ ఆఫర్ ను అనౌన్స్ చేసింది. 2024 అతిపెద్ద పండుగ సీజన్ కోసం తీసుకు వస్తున్న ఈ అప్ కమింగ్ సేల్ నుంచి రూ. 37,999 రూపాయల ఆఫర్ ధరకే iPhone 13 స్మార్ట్ ఫోన్ ను అందుకోండి, అని టీజింగ్ ను మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను ఇంత తక్కువ ధరకు ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GIF Sale: ఆఫర్

అమెజాన్ అప్ కమింగ్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి iPhone 13 ని చాలా తక్కువ ధరకు ఆఫర్ చేయనున్నట్లు అమెజాన్ టీజింగ్ చేస్తోంది. వాస్తవానికి, ఐఫోన్ 13 ఇప్పటికీ రూ. 47,500 రూపాయల ప్రారంభ ధరతో సేల్ అవుతోంది. కానీ, అమెజాన్ సేల్ నుంచి ఈ ఫోన్ ను అన్ని బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 37,999 రూపాయల ఆఫర్ ధరకు అంధిస్తామని అమెజాన్ చెబుతోంది.

Amazon GIF Sale iPhone 13 Deal

ఇదే కనుక నిజం అయితే ఎన్నడూ చూడని తక్కువ ధరకే ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ ను అందుకునే అవకాశం అమెజాన్ సేల్ అందిస్తుంది. అంతేకాదు, ఈ డీల్ ను కింగ్ ఆఫ్ ఆల్ డీల్స్ గా కూడా అమెజాన్ ప్రకటించింది. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తర్వాత ఐఫోన్ 13 ఫోన్ లను నిలిపి వేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. అంతేకాదు, ఐఫోన్ 13 ఫోన్ రేట్లు కూడా తగ్గించింది.

అయితే, అమెజాన్ సేల్ సమయంలో ఈ ఫోన్ ను బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ ప్రైస్ అందించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెజాన్ సేల్ లో ఈ ఫోన్ ను ఎంత ధరకి లిస్ట్ చేస్తుందో తెలియాలంటే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: పవర్ ఫుల్ సౌండ్ తో ఇంటిని షేక్ చేసే 5.2.4 ఛానల్ సౌండ్ బార్ లాంచ్ చేసిన ZEBRONICS.!

iPhone 13

ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ నిలిపి వేసినప్పటికీ ఈ ఫోన్ కోసం అప్డేట్ లు మాత్రం అందుతాయి. కాబట్టి ఈ ఫోన్ 40 వేల కంటే తక్కువ ధరలో లభిస్తే మంచి ఐఫోన్ డీల్ అవుతుంది. ఐఫోన్ 13 A15 Bionic తో వస్తుంది మరియు 12MP డ్యూయల్ రియర్ మరియు 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు Super Retina XDR OLED స్క్రీన్ తో ఆకట్టుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo