ప్రముఖ దేశీ ఆడియో బ్రాండ్ జెబ్రోనిక్స్ పవర్ ఫుల్ సౌండ్ తో ఇంటిని షేక్ చేసే 5.2.4 ఛానల్ సౌండ్ బార్ ను లాంచ్ చేసింది. ZEBRONICS Zeb Juke bar 9850 7.2.2 పేరుతో లాంచ్ చేసిన ఈ సౌండ్ బార్ టోటల్ 725W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది Dolby Atmos సపోర్ట్ మరియు కంప్లీట్ స్పీకర్ సెటప్ తో వస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
ZEBRONICS Zeb Juke bar 9850 : ఫీచర్స్
ఈ లేటెస్ట్ సౌండ్ బార్ 5.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు, 2 అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ వైర్లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ సెటప్ వుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 725W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 5 స్పీకర్లతో 305W సౌండ్, రెండు ఉఫర్ లు 220W హెవీ బాస్ ను మరియు శాటిలైట్ స్పీకర్లు 200W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తాయి.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఇందులో, BT v5.3, USB, AUX, Optical (IN) మరియు TV కోసం (eARC) కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ ఫంక్షనల్ రిమోట్, RGB LED లైట్స్ మరియు వైర్లెస్ UHF మైక్రోఫోన్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు పవర్ ఫుల్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది.
జెబ్రోనిక్స్ జ్యూక్ బార్ 9850 5.2.4 ఛానల్ సౌండ్ బార్ ను రూ. 27,999 ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు zebronics.com నుంచి సేల్ అవుతుంది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా జెబ్రోనిక్స్ అందించింది.