Gmail పాస్ వర్డ్ మర్చిపోతే ఎలా తిరిగి పొందాలి?
జిమెయిల్ పాస్వర్డ్ మరిచిపోతే ఎలా రికవర్ చేయాలి
స్టెప్ బై స్టెప్ గైడెన్స్
సింపుల్ సొల్యూషన్
అనుకోకుండా మీ Gmail పాస్ వర్డ్ ను మరచిపోతే? జిమెయిల్ లాగిన్ చేయడానికి మీరు ఏమి చేస్తారు? మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే, ఈ సమస్యకి సింపుల్ సొల్యూషన్ వుంది. అందుకే, ఒక వేళా అనుకోకుండా మీరు మీ జిమెయిల్ పాస్వర్డ్ మరిచిపోయినా, దాన్ని ఎలా రికవర్ చేయాలనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. దీని గురించి పూర్తిగా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకుందాం …
Gmail పాస్ వర్డ్ ను మర్చిపోతే ఎలా తిరిగి పొందాలి?
Step 1 – మొదట మీ Google Account లేదా Gmail పేజీని తెరవండి.
Step 2 – ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీలోని 'Forget Password' ఎంపిక పై క్లిక్ చేయండి.
Step 3 – మీకు గుర్తుంకువున్న చివరి పాస్ వర్డ్ ను నమోదు చేయండి. మీకు పాస్ వర్డ్ గుర్తులేకపోతే, 'మరో మార్గం ప్రయత్నించండి' (Try another way) ఎంచుకోండి.
Step 4 – మీ Gmail ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్ కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.
Step 5 – మీకు ఫోన్ నంబర్ లేకపోతే, Google మీ ఇమెయిల్ కు ఒక వెరిఫికేషన్ కోడ్ను పంపుతుంది. మీకు ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే, 'Try another way' ఎంచుకోండి.
Step 6 – ఇక్కడ మీకు ఇమెయిల్ పంపగల మరొక ఇమెయిల్ ఐడి ని గూగుల్ అడుగుతుంది.
Step 7: ఇప్పుడు మీరు గూగుల్ నుండి ఇమెయిల్ వచ్చినప్పుడు గూగుల్ డైలాగ్ బాక్స్ పేజీని తెరవండి.
Step 8 – రికవర్ అయిన తర్వాత, క్రొత్త పాస్ వర్డ్ ఉపయోగించి మీ Gmail కి లాగిన్ అవ్వండి.