ఇండియాలో VIVO V17 లాంచ్ డేట్ ఫిక్స్
ఈ ఫోన్ సూపర్ నైట్ మోడ్ తో రానుంది
వివో వి 17 స్మార్ట్ ఫోన్‌ను, డిసెంబర్ 9 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు వివో ధృవీకరించింది. ఈ కంపెనీ తన రాబోయే స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని ట్విట్టర్లో ప్రకటించింది. ఇంతకుముందు, వివో ఒక ఫోన్ లాంచ్ కోసం ఆహ్వానాలను పంపింది, అయితే ఇప్పుడు ఈ ఫోన్ వివో వి 17 అని ధృవీకరించింది. వివో వి 17 పంచ్ -హోల్ డిస్ప్లేను కలిగి ఉంటుందని ఈ టీజర్ చెబుతోంది. ఈ టీజర్ లో “సూపర్ నైట్ మోడ్” అని ప్రత్యేకంగా వ్రాసినందున మంచి తక్కువ కాంతి ఫోటోలను క్లిక్ చేయగల ఫోనుగా ఈ వివో V17 ని ఉంచుతోందని అర్ధమవుతోంది. వివో వి 17 L ఆకారపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని చెబుతున్నారు.
ఈ లేటెస్ట్ టీజర్, వివో యొక్క ట్విట్టర్ ఖాతా నుండి వచ్చింది. ఇది స్క్రీన్ యొక్క కుడి-ఎగువ అంచున ఉంచిన కటౌట్ లో పంచ్-హోల్ డిస్ప్లేని నిర్ధారిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను గత నెలలో రష్యాలో లాంచ్ చేశారు మరియు డ్యూడ్రాప్ నాచ్ మరియు డైమండ్ ఆకారంలో ఉన్న కెమెరా మాడ్యూల్ తో ఉంటుంది. అంతేకాకుండా, వివో ఎస్ 1 ప్రో వలె అదే స్మార్ట్ ఫోన్‌ను ఫిలిప్పీన్స్‌లో కూడా విడుదల చేశారు. ఇది స్నాప్‌డ్రాగన్ 665 తో పాటు 48MP వెనుక కెమెరా మరియు ముందు భాగంలో 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇంకా, ఇది 4500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
మునుపటి లీక్‌ల ప్రకారం, ఈ వివో వి 17 నీలం మరియు పింక్ అసెంట్ లో గ్రేడియంట్ వెనుక ప్యానెల్ ఫినిషింగ్ కలిగి ఉంటుంది. ఈ వివో వి 17 యొక్క భారతీయ వేరియంట్ వివో వి 17 వెనుక భాగంలో కనిపించే డైమండ్ ఆకారపు మాడ్యూల్‌కు బదులుగా, వెనుక ప్యానెల్ యొక్క ఎడమ ఎగువ భాగంలో ఉంచబడే ఎల్-ఆకారపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అయితే, రష్యా వేరియంట్ ప్రకారంగా చూస్తే, ఈ వివో వి 17 ను క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 చిప్ సెట్ ద్వారా అందించవచ్చు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వగలదు. ఈ స్మార్ట్ ఫోన్లో ఒక 6.44-అంగుళాల OLED డిస్ప్లే ఉండవచ్చు.