జస్ట్ మార్కెట్ లో విడుదలైన vivo V30e Top-5 ఫీచర్స్ మరియు Price తెలుసుకోండి.!

జస్ట్ మార్కెట్ లో విడుదలైన vivo V30e Top-5 ఫీచర్స్ మరియు Price తెలుసుకోండి.!
HIGHLIGHTS

వివో వి30e 5జి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది

vivo V30e Top-5 ఫీచర్స్ మరియు Price ఎలా ఉన్నదో ఒక లుక్కేద్దాం

ఈ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా వివో జత చేసింది

వివో గత కొన్ని రోజులుగా టీజింగ్ చేస్తున్న వివో వి30e 5జి స్మార్ట్ ఫోన్ ను జెస్ట్ ఈరోజు మధ్యాహ్నం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను సరికొత్త జెమ్ కట్ కెమెరా మోడ్యూల్, సోనీ ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమెరా మరియు స్టూడియో క్వాలిటీ Aura Light వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంఛ్ చేసింది. జస్ట్ మార్కెట్ లో విడుదలైన vivo V30e Top-5 ఫీచర్స్ మరియు Price ఎలా ఉన్నదో ఒక లుక్కేద్దాం పదండి.

vivo V30e Price

వివో వి30 స్మార్ట్ ఫోన్ ను సింగిల్ ర్యామ్ మరియు రెండు స్టోరేజ్ ఆప్షన్ లలో ప్రకటించింది. ఈ ఫోన్ 8GB + 128GB బేసిక్ వేరియంట్ ను రూ. 27,999 ధరతో విడుదల చేసింది. అలాగే, ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ను రూ. 29,999 ప్రైస్ ట్యాగ్ తో అందించింది. ఈ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా వివో జత చేసింది.

ఆఫర్స్

HDFC మరియు SBI బ్యాంక్ Credit మరియు Debit Card లతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 2,800 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అలాగే, ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా ప్రకటించింది. ఈరోజు నుండి ఈ ఫోన్ Pre-Bookings ను కూడా మొదలు పెట్టింది.

vivo V30e Top-5 features

Display

ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ కలిగిన 6.78 ఇంచ్ అల్ట్రా స్లిమ్ 3D Curved AMOLED డిస్ప్లేతో కలిగి వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1300 Nits పీక్ బ్రైట్నెస్ తో మంచి గేమింగ్ మరియు విజువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని వివో తెలిపింది.

Processor

వివో ఈ కొత్త ఫోన్ ను Qualcomm Snapdragon 6 Gen 1 5G ప్రోసెసర్ తో అందించింది. ఇది 4nm ప్రోసెసర్ కాబట్టి పవర్ ఎఫిషియన్సీ మరియు మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని వివో తెలిపింది.

RAM & Storage

ఈ ఫోన్ లో 8 GB ఫిజికల్ RAM మరియు 8GB Extended RAM ఉన్నాయి. అంటే, ఈ ఫోన్ తో మొత్తం 16GB RAM పనితనాన్ని చూడవచ్చు. అలాగే, ఈ ఫోన్ లో హెవీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

Also Read: BOSE సౌండ్ సపోర్ట్ తో Moto Buds+ తీసుకు వస్తున్న మోటోరోలా.!

Camera

ఈ వివో ఫోన్ కెమెరా పరంగా చాలా ప్రత్యేకతలను కలిగి వుంది. ఇందులో వెనుక 50 MP (AF+OIS) మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50 MP Eye AF సెల్ఫీ కెమేరా కలిగి వుంది.

vivo V30e Top-5 features (vivo V30e Camera)
vivo V30e Camera

ఈ ఫోన్ కెమెరా యొక్క ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాలతో 4K Video లను షూట్ చేయవచ్చు. అలాగే, 50 MP Sony IMX882 సెన్సార్ మరియు స్టూడియో క్వాలిటీ Aura Light సెటప్ తో DSLR వంటి డీటెయిల్స్ తో ఫోటో లను షూట్ చేయవచ్చని కూడా వివో చెబుతోంది.

Battery

వివో ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా సన్నని డిజైన్ తో అందించినా, ఇందులో 5500mAh బిగ్ బ్యాటరీ జత చేసింది. అంతేకాదు, అతి సన్నని డిజైన్ లో ఇంత పెద్ద బ్యాటరీ కలిగి వున్న మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఈ వివో లేటెస్ట్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo