Noise ColorFit Pro 5: మరిన్ని స్ట్రాప్స్ మరియు మారిన్ని ఫీచర్స్ తో నోయిస్ స్మార్ట్ వాచ్ లాంచ్.!

HIGHLIGHTS

మరిన్ని స్ట్రాప్స్ మరియు మారిన్ ఫీచర్స్ తో Noise కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్

సిలికాన్, మెటల్, లెథర్ మరియు నైలాన్ స్ట్రాప్స్ ఆప్షన్ లతో లాంచ్ చేసింది

మొదటి 500 కస్టమర్లకు 500 రూపాయల డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది

Noise ColorFit Pro 5: మరిన్ని స్ట్రాప్స్ మరియు మారిన్ని ఫీచర్స్ తో నోయిస్ స్మార్ట్ వాచ్ లాంచ్.!

ప్రముఖ ఇండియన్ బ్రాండ్ నోయిస్ మరిన్ని స్ట్రాప్స్ మరియు మారిన్ ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది. ColorFit Pro 5 పేరుతో తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ను మరిన్ని కలర్స్ తో పాటుగా సిలికాన్, మెటల్, లెథర్ మరియు నైలాన్ స్ట్రాప్స్ ఆప్షన్ లతో లాంచ్ చేసింది. నోయిస్ లేటెస్ట్ గా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ కేవలం కలర్ మరియు మెటీరియల్ ఆప్షన్ లు మాత్రమే కాదు మరిన్ని ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. నోయిస్ సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్లు తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Noise ColorFit Pro 5 Price

నోయిస్ ఫిట్ ప్రో 5 స్మార్ట్ వాచ్ ను రూ. 3,999 రూపాయల లాంచ్ ఆఫర్ ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ పైన మరొక లాంచ్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ వాచ్ ను ముందుగా కొనుగోలు చేసే మొదటి 500 కస్టమర్లకు 500 రూపాయల డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. అయితే, ఈ వాచ్ ను నోయిస్ వెబ్సైట్ నుండి కొనే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే, ఈ స్మార్ట్ వాచ్ అమేజాన్ నుండి కూడా లభిస్తోంది.

Also Read : Jio Phone Prima ఫోన్ కోసం కొత్త ప్లాన్స్ అందించిన జియో.!

నోయిస్ ఫిట్ ప్రో 5 ప్రత్యేకతలు

నోయిస్ ఫిట్ ప్రో 5 స్మార్ట్ వాచ్ 1.85 (44mm) ఇంచ్ AMOLED డిస్ప్లేని డే లైట్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ సిలికాన్, మెటల్, లెథర్ మరియు నైలాన్ స్ట్రాప్స్ ను 10 రకాలైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ వాచ్ SOS టెక్నాలజీ, ఫంక్షన్ లను సరిచేసుకోవడానికి వీలుగా కస్టమైజ్డ్ బటన్ ఫంక్షనాలిటీ కూడా వుంది.

Noise ColorFit Pro 5 features
నోయిస్ ఫిట్ ప్రో 5 ప్రత్యేకతలు

అలాగే, ఇందులో ఫంక్షనల్ రొటేటింగ్ క్రౌన్,TruSync పవర్ బ్లూటూత్ కాలింగ్, DIY వాచ్ పేస్ లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ మరియు బిల్ట్ స్పీకర్ కూడా ఉన్నాయి. ఇది కొత్త స్మార్ట్ డాక్ ఫీచర్, Real Time AQI Update మరియు ఎమోజీ సపోర్ట్ తో కూడా వస్తుంది. నోయిస్ హెల్త్ సూట్ తో కంప్లీట్ హెట్ కంట్రోల్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo