Noise ColorFit Pro 5: గొప్ప డిజైన్ మరియు స్మార్ట్ డాక్ ఫీచర్ తో లాంచ్ అవుతోంది.!
ఫిట్ ప్రో 4 నెక్స్ట్ జెనెరేషన్ వాచ్ Noise ColorFit Pro 5 ను లాంచ్ చేస్తోంది కంపెనీ
నవంబర్ 28న ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు నోయిస్ అనౌన్స్ చేసింది
ధర మరియు ఫీచర్లను కూడా నోయిస్ లాంచ్ కంటే ముందుగానే వెల్లడించింది
స్మార్ట్ వాచ్ ప్రపంచంలో ఆకర్షణీయమైన ధరలో తగిన ఫీచర్స్ తో స్మార్ట్ వాచ్ లను అందిస్తున్న బ్రాండ్ గా పేరుపొందిన నోయిస్ నుండి మరొక స్మార్ట్ వాచ్ లంచ్ అవుతోంది. గతంలో వచ్చిన నోయిస్ కలర్ ఫిట్ ప్రో 4 నెక్స్ట్ జెనెరేషన్ వాచ్ Noise ColorFit Pro 5 ను లాంచ్ చేస్తోంది కంపెనీ. స్మార్ట్ వాచ్ ను నవంబర్ 28న ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు నోయిస్ అనౌన్స్ చేసింది. ఈ నోయిస్ అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్లను కూడా నోయిస్ లాంచ్ కంటే ముందుగానే వెల్లడించింది.
SurveyNoise ColorFit Pro 5 Price
నోయిస్ కలర్ ఫిట్ ప్రో 5 స్మార్ట్ వాచ్ ను కంపెనీ రూ. 3,999 రూపాయల లాంచ్ ధరతో ప్రకటించింది. అంతేకాదు, ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ పైన లాంచ్ అఫర్ ను కూడా నోయిస్ అందించింది. అదేమిటంటే, నోయిస్ కలర్ ఫిట్ ప్రో 5 స్మార్ట్ వాచ్ ను మొదటిగా కొనుగోలు చేసే 500 మంది కస్టమర్లకు రూ. 500 రూపాయల డిస్కౌంట్ ను అందిస్తుంది.
Also Read : Black Friday Deal: iQOO లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్.!
నోయిస్ కలర్ ఫిట్ ప్రో 5 ప్రత్యేకతలు
నోయిస్ కలర్ ఫిట్ ప్రో 5 స్మార్ట్ వాచ్ రొటేటింగ్ క్రౌన్ బటన్ తో వస్తుంది. అలాగే, ఇందులో అన్ని పనులకు ఉపయోగపడే ఒక వర్సటైల్ పవర్ బటన్ కూడా వుంది. ఈ స్మార్ట్ వాచ్ మిల్స్ ఇన్ మాక్రో ఫోన్ మరియు స్పీకర్ లను కూడా కలిగి వుంది. నోయిస్ ఈ స్మార్ట్ వాచ్ ను మల్టి పుల్ స్ట్రాప్స్ తో మరింత స్టైలిష్ గా అందించింది. ఈ స్మార్ట్ వాచ్, మెటల్, లెథర్ మరియు రైన్ బో కలర్ స్టాప్ తో కూడా వస్తుంది.

ఈ వాచ్ మొత్తం 10 కలర్ స్ట్రాప్ ఆప్షన్ లతో లభిస్తుంది. ఈ నోయిస్ కొత్త సార్ట్ వాచ్ బిగ్ AMOLED డిస్ప్లేని సన్నని అంచులతో కలిగి ఉంటుంది. ఈ వాచ్ లో AQI మరియు స్ట్రెస్ లెవల్ మోనిటర్ కూడా వుంది. ఈ వాచ్ TurSync పవర్డ్ BT కాలింగ్ తో కూడా వస్తుంది. ఇందులో, క్యాలికులేటర్, 24×7 హార్ట్ రేట్ మోనిటర్, స్లీప్ ట్రాకింగ్, ఫీమేల్ సైకిల్ ట్రాకర్, SpO2 మోనిటర్ మరియు నోయిస్ హెల్త్ సూట్ సపోర్ట్ కూడా వుంది.
ఈ వాచ్ 7 రోజుల బ్యాకప్ అందించ గల బ్యాటరీ, 100 స్పోర్ట్స్ మోడ్స్ మరియు డైనమిక్ వాచ్ ఫేస్ వంటి మరిన్ని ఇతర ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఈ వాచ్ IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile