Redmi Note 17 Pro Max ఫస్ట్ డే సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోకండి .. సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

HIGHLIGHTS

Redmi Note 17 Pro Max ఫస్ట్ డే సేల్ రేపు స్టార్ట్ అవుతుంది

ఈ ఫస్ట్ డే సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్స్ ని షియోమీ అనౌన్స్ చేసింది

ఈ కొత్త షియోమీ స్మార్ట్ ఫోన్ ను మీరు బెస్ట్ ప్రైస్ లో అందుకోవచ్చు

Redmi Note 17 Pro Max ఫస్ట్ డే సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోకండి .. సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

Redmi Note 17 Pro Max ఫస్ట్ డే సేల్ రేపు స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ డే సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్స్ ని షియోమీ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి షియోమీ అందించిన బిగ్ డీల్స్ మరియు ఆఫర్స్ తో ఈ కొత్త షియోమీ స్మార్ట్ ఫోన్ ను మీరు బెస్ట్ ప్రైస్ లో అందుకోవచ్చు. అందుకే, రేపు సార్ట్ కాబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ డే సేల్ ఆఫర్స్ అండ్ డీల్స్ ఈరోజు ఒకసారి గుర్తు చేస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 17 Pro Max : ఆఫర్స్

ఈ లేటెస్ట్ షియోమీ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు అనగా, సెప్టెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఫస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ ను SBI అండ్ Axis క్రెడిట్ కార్డుతో తీసుకునే వారికి రూ. 5,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన్ ఆకర్షణీయమైన అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ని కూడా షియోమీ అందించింది.

Redmi Note 17 Pro Max first sale offers

ప్రైస్

ఈ ఆఫర్ తో ఈ ఫోన్ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆఫర్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోన్ బేసిక్ 8GB + 256GB వేరియంట్ ఆఫర్ తో రూ. 44,999 ధరలో లభిస్తుంది. అలాగే, హై ఎండ్ 12GB + 256GB వేరియంట్ కూడా రూ. 49,999 ఆఫర్ ధరలో ఫస్ట్ డే సేల్ నుంచి మీకు లభిస్తుంది. నిజానికి, ఈ ఒరిజినల్ ప్రైస్ రూ. 49,999 మరియు రూ. 54,999 గా కంపెనీ అందించింది. ఈ ఫోన్ అమెజాన్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి లభిస్తుంది.

Also Read: Smart TV కొనేటప్పుడు మీరు చేసే ప్రధాన తప్పులు ఎలా నివారించాలి: పూర్తి గైడ్

Redmi Note 17 Pro Max : ఫీచర్స్

షియోమీ ఈ ఫోన్ ను చాలా ప్రీమియం ఫీచర్స్ తో అందించింది. ఇందులో, పెద్ద 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ అందించింది. ఈ బిగ్ స్క్రీన్ 120Hz రిజల్యూషన్, 1.5K రిజల్యూషన్ మరియు 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఆప్టికల్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్, HDR10 + మరియు Dolby Vision వంటి అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ Snapdragon 6 Gen 5 ప్రాసెసర్, డ్యూయల్ సర్జ్ P3 జతగా సర్జ్ G2 చిప్ తో టోటల్ ట్రిపుల్ చిప్ పవర్ తో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ పీక్స్ వెళ్ళడానికి వీలుగా 12GB LPDDR5x ర్యామ్ జతగా 12GB వర్చువల్ ర్యామ్ తో టోటల్ 24GB ర్యామ్ ఫీచర్ ని అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో గరిష్టంగా 256GB హెవీ స్టోరేజ్ తో ఆప్షన్ కూడా అందించింది.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ తో 30FPS వద్ద 4k వీడియో రికార్డింగ్ సపోర్ట్ అందించింది. అలాగే, అండర్ వాటర్ కెమెరా మోడ్, 2x అల్ట్రా క్లియర్ జూమ్ తో పాటు ఇటీవల వచ్చిన లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

ఈ ఫోన్ 10,000 mAh సిలికాన్ బ్యాటరీ తో వచ్చింది. అలాగే, వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 27W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇది Dolby Atmos, Hi-Res సపోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ మరియు 400% వాల్యూమ్ బూస్ట్ ఫీచర్ తో వస్తుంది. ఇది IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile