Smart TV కొనేటప్పుడు మీరు చేసే ప్రధాన తప్పులు ఎలా నివారించాలి: పూర్తి గైడ్

HIGHLIGHTS

గతంతో పోలిస్తే Smart TV కొనడం ఇప్పుడు చాలా సులభంగా అనిపిస్తుంది

గూగుల్ టీవీ వంటి ఎన్నో అప్షన్స్ మీకు మార్కెట్‌ లో అందుబాటులో ఉన్నాయి

మీ స్మార్ట్ టీవీ ఎంపికను చాలా సులభంగా చేయడానికి తప్పులు ఎలా అవాయిడ్ చేయాలో వివరంగా అందిచాము

Smart TV కొనేటప్పుడు మీరు చేసే ప్రధాన తప్పులు ఎలా నివారించాలి: పూర్తి గైడ్

గతంతో పోలిస్తే Smart TV కొనడం ఇప్పుడు చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ, 4K డిస్‌ప్లే, HDR, డాల్బీ అట్మోస్, AI ఫీచర్లు, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గూగుల్ టీవీ వంటి ఎన్నో అప్షన్స్ మీకు మార్కెట్‌ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, ఈ అన్ని ఫీచర్స్ లో మీకు ఏది సరైనది? అనే ప్రశ్న మీ టీవీ ఎంపికను చికాకు కలిగించే అంశంగా మారుస్తుంది. అయితే, మీ స్మార్ట్ టీవీ ఎంపికను చాలా సులభంగా చేయడానికి మీరు చేసే తప్పులు ఎలా అవాయిడ్ చేయాలో వివరంగా అందిచాము. ఈ గైడ్‌లో స్మార్ట్ టీవీ కొనేటప్పుడు సాధారణంగా జరిగే తప్పులు మరియు వాటిని ఎలా నివారించాలో సింపుల్‌ గా వివరించే ప్రయత్నం చేశాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్క్రీన్ సైజ్ మాత్రమే చూసి టీవీ కొనకండి

చాలామంది “పెద్ద స్క్రీన్ అయితే బాగుంటుంది” అని మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి టీవీ సైజ్ మీ గది పరిమాణం మరియు వ్యూవింగ్ డిస్టెన్స్ కు సరిపోవాలి. చిన్న గదిలో చాలా పెద్ద టీవీ పెట్టుకుంటే స్క్రీన్‌ ను చాలా దగ్గరగా చూడాల్సి రావచ్చు. అలాకాకుండా పెద్ద హాల్‌ కోసం చిన్న టీవీ తీసుకుంటే సినిమాలు మరియు స్పోర్ట్స్ చూసేటప్పుడు మీరు టీవీ చూసే మజా పూర్తిగా ఖరాబు అయ్యే అవకాశం ఉంటుంది.

ఏం చేయాలి?

మీకు మీ ఇంటి కోసం టీవీ కొనేముందు మీరు సాధారణంగా టీవీ చూసే దూరాన్ని కొలవండి. ఆ దూరానికి సరిపోయే స్క్రీన్ సైజు ని మాత్రమే ఎంచుకోండి.

4K అనే పదం చూసి కళ్లు మూసుకొని సెలక్ట్ చేయకండి

ప్రస్తుతం చాలా స్మార్ట్ టీవీలు 4K రిజల్యూషన్ తో వస్తున్నాయి. కానీ, నిజానికి రిజల్యూషన్ ఒక్కటే పిక్చర్ క్వాలిటీని నిర్ణయించలేదు. ప్యానల్ క్వాలిటీ, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, HDR సపోర్ట్, కలర్ యాక్యురసీ, ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి అంశాలు కూడా పిక్చర్ క్వాలిటీ పై ప్రభావం చూపుతాయి. సింపుల్ గా చెప్పాలంటే, 4K రిజల్యూషన్ కలిగిన రెండు టీవీలు వాటి స్క్రీన్ ఫీచర్స్ కారణంగా వేరు వేరు క్వాలిటీ పిక్చర్ అందిస్తాయి.

Smart TV buying guide

అందుకే, కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే సమయంలో ప్యానల్ క్వాలిటీ, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, HDR సపోర్ట్, కలర్ యాక్యురసీ, ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్స్ ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇది మీ స్మార్ట్ టీవీ కొనుగోలును మరింత స్మార్ట్ గా మారుస్తుంది.

రిఫ్రెష్ రేట్ మాయలో పడకండి

ప్రస్తుతం మార్కెట్లో 60Hz, 120Hz మరియు 144Hz రిఫ్రెష్ రేట్ అంటూ చాలా అడ్వర్టైజ్మెంట్ లు నడుస్తున్నాయి. అయితే, మీరు మీ అవసరానికి తగిన వాటిని మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే, మీరు సినిమాలు, యూట్యూబ్ మరియు OTT కంటెంట్ కోసం మాత్రమే స్మార్ట్ టీవీ తీసుకుంటే మీకు 60Hz రిఫ్రెష్ రేట్ సరిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మాన్యుఫ్యాక్చర్ చెప్పే రిఫ్రెష్ రేట్ మరియు నేటివ్ రిఫ్రెష్ రేట్ ఒకటి కాకపోవచ్చు. ఇది సాఫ్ట్ వేర్ మోషన్ తో కూడా రిఫ్రెష్ రేట్ ని ప్రేరేపితం చేసే అవకాశం ఉంటుంది.

ఏం చేయాలి?

మీకు టీవిలో గేమింగ్ ముఖ్యమైతే నేటివ్ రిఫ్రెష్ రేట్, HDMI 2.1 సపోర్ట్, VRR మరియు సపోర్టెడ్ గేమింగ్ రిజల్యూషన్ వంటి స్పెసిఫికేషన్ చెక్ చేయండి.

HDR ఉంటే చాలు అంతా సూపర్ అనుకోకండి

టీవీ బాక్స్ పై HDR10, Dolby Vision వంటి పేర్లు కనిపించడం మంచిదే. కానీ, HDR ఎక్స్ పీరియన్స్ అనేది కేవలం ఫార్మాట్ సపోర్ట్ పై మాత్రమే ఆధారపడదు అని గుర్తుంచుకోండి. HDR కంటెంట్ ను సరిగ్గా చూపించడానికి టీవీకి తగిన బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మరియు లోకల్ డిమ్మింగ్ కేపబిలిటీ కూడా అవసరం కావచ్చు. కాబట్టి, జస్ట్ “HDR supported” అనే ఒక్క ప్రత్యేకత ఆధారంగా నిర్ణయం తీసుకోకండి.

Smart TV buying guide list

టీవీకి సౌండ్ కూడా ప్రాణమే అవుతుంది

కొత్త టీవీ కొనేటప్పుడు చాలామంది మొత్తం దృష్టిని డిస్ప్లే పైన మాత్రమే పెడతారు. కానీ, టీవీ స్పీకర్లు మీ రోజువారీ వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ లో ముఖ్యమైన భాగం అని మర్చిపోకండి. ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, టీవీ ఎంత స్లిమ్ గా ఉంటే బిల్ట్ ఇన్ స్పీకర్ అంత పరిమితంగా ఉంటుంది.

టీవీ కొనేముందు చెక్ చేయాల్సిన పాయింట్స్

  • స్పీకర్ అవుట్ పుట్
  • Dolby Atmos సపోర్ట్
  • అవసరమైతే DTS సపోర్ట్
  • HDMI ARC/eARC
  • ఆప్టికల్ ఆడియో అవుట్ పుట్
  • Bluetooth ఆడియో సపోర్ట్

మీరు సినిమాలు ఎక్కువగా చూసే వారైతే భవిష్యత్తులో సౌండ్ బార్ లేదా హోమ్ థియేటర్ ని జత చేయాలనుకుంటే, అది టీవీ కొనే సమయంలో ఆలోచించండి.

Also Read: Vivo V80 లాంచ్ డేట్ మరియు టీజర్ ఇమేజ్ రిలీజ్ చేసిన వివో .. ఐఫోన్ 18 లేని లోటు తీరుస్తుందా.!

Processor గురించి పట్టించుకోకపోవడం అతిపెద్ద తప్పు

టీవీ ఫీచర్స్ లో ప్రాసెసర్ చాలా చిన్నగా మాత్రమే కనిపించినా, అది ఓవరాల్ ఎక్స్ పీరియన్స్ పై ప్రభావం చూపుతుంది.

Warranty మరియు సేల్ తర్వాత సర్వీస్ మస్ట్ గా చూడండి

టీవీ అనేది ఇంట్లో సంవత్సరాలు కొనసాగే ఒక లాంగ్ టర్మ్ వస్తువు. అందుకే, ధరతో పాటు Warranty, ఇన్ స్టాలేషన్ మరియు సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలను కూడా నిశితంగా పరిశీలించాలి.

ఈ విధంగా ఈ పైన తెలిపిన విషయాలు దృష్టిలో ఉంచుకుంటే, మీరు మీ ఇంటికి తగిన బెస్ట్ స్మార్ట్ టీవీని ఎంచుకోవచ్చు.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile