Vivo V80 లాంచ్ డేట్ మరియు టీజర్ ఇమేజ్ రిలీజ్ చేసిన వివో .. ఐఫోన్ 18 లేని లోటు తీరుస్తుందా.!

HIGHLIGHTS

Vivo V80 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని ఈరోజు వివో రిలీజ్ చేసింది

ఈ ఫోన్ రూపురేఖలను వెల్లడించే టీజర్ ఇమేజ్ ను కూడా ఈరోజు రిలీజ్ చేసింది

ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.59 ఇంచ్ 1.5K OLED స్క్రీన్తో లాంచ్ అవుతుంది

Vivo V80 లాంచ్ డేట్ మరియు టీజర్ ఇమేజ్ రిలీజ్ చేసిన వివో .. ఐఫోన్ 18 లేని లోటు తీరుస్తుందా.!

Vivo V80 స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదల చేయబోతున్న లాంచ్ డేట్ ని ఈరోజు వివో రిలీజ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం గత వారం రోజులుగా కేవలం ‘కమింగ్ సూన్’ పేరుతో మాత్రమే టీజింగ్ చేసిన వివో, ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ రిలీజ్ చేసింది. కేవలం ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ ఫోన్ రూపురేఖలను వెల్లడించే టీజర్ ఇమేజ్ ను కూడా ఈరోజు రిలీజ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V80 ఎప్పుడు లాంచ్ అవుతుంది?

వివో వి 80 స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేయడానికి టైం సెట్ చేసినట్లు వివో అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ లాంచ్ డేట్ తో పాటు టీజర్ ఇమేజ్ ని కూడా ఈరోజు రిలీజ్ చేసింది.

టీజర్ ఇమేజ్ ఏమి చెబుతోంది?

వివో వి80 స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ఈ అప్ కమింగ్ డిజైన్ ను వివరిస్తోంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్, ఫోన్ డిజైన్ మరియు కెమెరా మాడ్యూల్ వంటి వివరాలు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ వెల్లడించింది. ఈ ఫోన్ ను సరికొత్త ఆరంజ్ కలర్ లో లాంచ్ చేస్తున్నట్లు ఈ టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ చూడటానికి స్లైట్ గా లేటెస్ట్ ఐఫోన్ మాదిరి డిజైన్ తో ఉన్నట్లు అనిపిస్తుంది.

Vivo V80 launch date

అందుకే, నెటిజన్లు ఈ ఫోన్ ఐఫోన్ 18 లేని లోటు తీరుస్తుందా? అని టీజింగ్ చేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ కి ఎలాంటి సంబంధం ఉండదని గమనించాలి. ఈ అప్ కమింగ్ వివో ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని వివో ఇప్పటికే వివరాలు వెల్లడించింది.

Also Read: Amazon GIF Sale 2026 బిగ్ సౌండ్ బార్ డీల్ ని రివీల్ చేసిన అమెజాన్.!

వివో వి80 ఫీచర్స్

ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.59 ఇంచ్ 1.5K OLED స్క్రీన్తో లాంచ్ అవుతుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వివో ఈ అప్ కమింగ్ ఫోన్ ను Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ 50MP ZEISS OIS మెయిన్ కెమెరా జతగా అల్ట్రా వైడ్ మరియు 50MP ZEISS టెలిఫోటో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు కూడా 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన కెమెరా సెటప్ తో సినిమా గ్రేడ్ ఫోటోలు మరియు హై క్వాలిటీ 4K వీడియో రికార్డింగ్ తో వస్తుంది.

Vivo V80 features

ఈ ఫోన్ లో 7200 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే, ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 90w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Origin OS7 ఆధారితంగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS తో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile