Amazon GIF Sale 2026 బిగ్ సౌండ్ బార్ డీల్ ని రివీల్ చేసిన అమెజాన్.!
అమెజాన్ అతిపెద్ద పండుగ సేల్ Amazon GIF Sale 2026
అప్ కమింగ్ సేల్ బిగ్ డీల్స్ ను ఇప్పటి నుంచే అనౌన్స్ చేయడం ప్రారంభించింది
డాల్బీ అట్మోస్ సౌండ్ బార్లను బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది
అమెజాన్ వచ్చే నెల ఎనిమిదో తారీకు నుంచి ప్రారంభించనున్న అమెజాన్ యొక్క అతిపెద్ద పండుగ సేల్ Amazon GIF Sale 2026 బిగ్ డీల్స్ ను ఇప్పటి నుంచే అనౌన్స్ చేయడం ప్రారంభించింది. ముందుగా ఈ అప్ కమింగ్ సెల్ నుంచి అందించనున్న స్మార్ట్ ఫోన్ వివరాలు రివీల్ చేసిన అమెజాన్, ఇప్పుడు సౌండ్ బార్ డీల్స్ కూడా రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి సోనీ మరియు శాంసంగ్ వంటి పెద్ద బ్రాండ్స్ రిలీజ్ చేసిన లేటెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్లను బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
SurveyAmazon GIF Sale 2026: ఆఫర్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అతి భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించబోతున్నట్లు అమెజాన్ టీజింగ్ చేసింది. ఇందులో భాగంగా అమెజాన్ అప్ కమింగ్ బిగ్ పండుగ సేల్ నుంచి సోనీ మరియు శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్ లు రిలీజ్ చేసిన సౌండ్ బార్ డీల్స్ ను ఇప్పుడు టీజింగ్ చేసింది.

Sony soundbar
ఇక సౌండ్ బార్ ఆఫర్ విషయానికి వస్తే, సోనీ ఇటీవల లేటెస్ట్ గా విడుదల చేసిన 5.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ ను అమెజాన్ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో రీజనబుల్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేసింది. అమెజాన్ ఈ సౌండ్ బార్ పై డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు ఆఫర్స్ తో సోనీ యొక్క లేటెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని మంచి ఆకర్షణీయమైన ధరలో అందుకోవచ్చని చెబుతోంది.
Also Read: SIM Card ఫ్రాడ్ మరియు IMEI టాంపరింగ్ పై DoT ఉక్కుపాదం: వెంటనే మీ వివరాలు చెక్ చేసుకోండి.!
Samsung soundbar
శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన ప్రీమియం డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ నుంచి మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు అని అమెజాన్ హింట్ ఇస్తోంది. శాంసంగ్ లేటెస్ట్ సౌండ్ బార్ 5.1.2ch డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ HW-Q800H/XL మోడల్ పై ఈ డీల్స్ అందిస్తున్నట్లు చెబుతోంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి ఈరోజు రూ. 42,990 రూపాయల ధరలో సేల్ అవుతోంది. అయితే, అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ కలుపుకొని ఈ సౌండ్ బార్ కేవలం 35 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరి అమెజాన్ అప్ కమింగ్ పండుగ సేల్ అయిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ మరింకేదైనా కొత్త ఆఫర్ తో మరింత చవక ధరలో అందించే అవకాశం ఉంటే, సేల్ నాటికి మనకు తెలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
